ప్రతిభకు గౌరవం
eenadu telugu news
Published : 18/10/2021 03:58 IST

ప్రతిభకు గౌరవం


జ్యోతి వెలిగిస్తున్న లక్ష్మీనారాయణ తదితరులు

కవాడిగూడ, న్యూస్‌టుడే: సమాజం ప్రతిభావంతులను గౌరవిస్తుందని విశ్రాంత ఐఏఎస్‌ అధికారి జి.ఎన్‌.రావు అన్నారు. ఆదివారం ట్యాంక్‌బండ్‌ సమీపంలోని తలారి మాణిక్యాంబ హాలులో అఖిల భారత తెలగ, బలిజ, కాపు సంఘం, మన అమెరికన్‌ తెలుగు అసోసియేషన్‌ సంయుక్త ఆధ్వర్యంలో పలువురు విద్యార్థులకు ఎన్‌ఆర్‌ఐ ఉపకార వేతనాలను అందజేశారు. సీబీఐ మాజీ జాయింట్‌ డైరెక్టర్‌ లక్ష్మీనారాయణ, ప్రియదర్శిని ఎడ్యుకేషన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఛైర్మన్‌ చందు రామారావు, అఖిల భారత తెలగ, బలిజ, కాపు సంఘం అధ్యక్షుడు ప్రభాకర్‌రావు, ప్రధాన కార్యదర్శి హన్మంతరావు, సంఘం నాయకులు మారేశ్వర్‌రావు, హరిత పాల్గొన్నారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని