27 ఏఎన్‌ఎం పోస్టుల భర్తీ
eenadu telugu news
Published : 19/10/2021 01:21 IST

27 ఏఎన్‌ఎం పోస్టుల భర్తీ

వికారాబాద్‌ కలెక్టరేట్‌, న్యూస్‌టుడే:  జిల్లాలో 27  ఏఎన్‌ఎం (మహిళ)  పోస్టులను భర్తీ చేస్తున్నామని  వైద్యాధికారి డాక్టర్‌ తుకారాంభట్‌ సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. పొరుగు సేవల ప్రాతిపదికన వీరిని నియమిస్తామని పేర్కొన్నారు. అభ్యర్థులు ఇంటర్మీడియట్‌ ఒకేషనల్‌ ఎంపీహెచ్‌డబ్ల్యూ కోర్సు పూర్తి చేసి, ఏడాది పాటు క్లినికల్‌ శిక్షణ పొంది ఉండాలని వివరించారు. గుర్తించిన ఆసుపత్రుల్లో సంవత్సర కాలం అప్రెంటీస్‌గా పనిచేయడంతోపాటుగా.. తప్పని సరిగా తెలంగాణ పారా మెడికల్‌ బోర్డులో పేరు నమోదు చేసుకోవాలని వెల్లడించారు. అర్హులైన వారు ఈనెల 20   నుంచి 22 వరకు దరఖాస్తు చేసుకోవాలని, అదనపు వివరాలకు తమ కార్యాలయంలో సంప్రదించాలని ఆయన సూచించారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని