కారు, ద్విచక్రవాహనం ఢీ.. యువకుడి మృతి
eenadu telugu news
Published : 19/10/2021 01:21 IST

కారు, ద్విచక్రవాహనం ఢీ.. యువకుడి మృతి

చేగుంట, న్యూస్‌టుడే: అతివేగంగా వచ్చిన కారు.. ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టడంతో ఓ యువకుడు మృతి చెందిన ఘటన మెదక్‌ జిల్లా చేగుంట వద్ద 44వ జాతీయ రహదారిపై చోటుచేసుకుంది. స్థానిక ఎస్‌ఐ సుభాష్‌గౌడ్‌ తెలిపిన వివరాలు.. చేగుంట మండలం రెడ్డిపల్లికి చెందిన మాణెమ్మ, నర్సింలు దంపతులకు మహేశ్‌ (22), ఓ కుమార్తె ఉన్నారు. మహేశ్‌ చేగుంట ఏఎంసీ గోదాంలోని రాష్ట్ర వేర్‌హౌసింగ్‌ కార్పొరేషన్‌లో ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగిగా పని చేస్తున్నాడు. సోమవారం గోదాంలో నిల్వ చేసిన బియ్యం బస్తాలను లారీలో నింపిన తర్వాత తూకం వేసేందుకు 44వ జాతీయ రహదారి పక్కన ఉన్న ధర్మకాంట వద్దకు ద్విచక్రవాహనంపై శ్రీకాంత్‌ అనే యువకుడితో కలిసి వెళ్లాడు. తూకం ప్రక్రియ ముగిశాక రోడ్డుపైకి వస్తున్న క్రమంలో హైదరాబాద్‌ నుంచి నిజామాబాద్‌ వైపు వెళ్తున్న కారు అతి వేగంగా వచ్చి ఢీకొట్టడంతో ద్విచక్ర వాహనంపై ఉన్న మహేశ్‌, శ్రీకాంత్‌లు తీవ్రంగా గాయపడ్డారు. అక్కడున్న వారు గమనించి పోలీసులకు, కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. వారొచ్చి హైదరాబాద్‌కు తరలిస్తుండగా మార్గమధ్యలో మహేష్‌ మృతిచెందాడు. శ్రీకాంత్‌ హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. మృతుడి తండ్రి నర్సింహులు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఎస్‌ఐ వివరించారు. ప్రమాదానికి కారణమైన డ్రైవర్‌ కారును అక్కడే వదిలేసి పారిపోయాడు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని