అప్పుల బాధతో యువ రైతు ఆత్మహత్య
eenadu telugu news
Published : 19/10/2021 01:21 IST

అప్పుల బాధతో యువ రైతు ఆత్మహత్య

మహేశ్‌

న్యూస్‌టుడే - దుబ్బాక, మిరుదొడ్డి: అప్పుల బాధ తాళలేక ఓ యువరైతు ఆత్మహత్య చేసుకున్న ఘటన సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండలం ఖాజీపూర్‌ గ్రామంలో చోటుచేసుకుంది. భూంపల్లి ఠాణా శిక్షణ ఎస్‌ఐ జలంధర్‌రెడ్డి తెలిపిన వివరాలు.. గ్రామానికి చెందిన మహేశ్‌(31)కు ఒక ఎకరా పొలం ఉండగా, దాన్ని సాగుచేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. అతడికి భార్య కనకవ్వ, ఇద్దరు కుమారులున్నారు. ట్రాక్టర్‌, ఆటో అప్పు చేసి కొనుగోలు చేశాడు. సాగు ద్వారా తగినంత ఆదాయం రాక ఆటో నడుపుతున్నాడు. అప్పులు పెరిగి, నెలవారీ కిస్తీలు కట్టలేకపోతున్నాడు. రూ.9 లక్షల వరకు అప్పులు మిగిలాయి. తీర్చే మార్గం కానరాక వనస్తాపంతో ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఆదివారం అర్ధరాత్రి ఉరేసుకున్నాడు. గ్రామస్థుల ద్వారా విషయం తెలుసుకున్న పోలీసులు శవ పరీక్ష నిమిత్తం దుబ్బాక సామాజిక ఆసుపత్రికి తరలించారు. భార్య కనకవ్వ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు శిక్షణ ఎస్‌ఐ వివరించారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని