బాలికతో అసభ్య ప్రవర్తన.. రెండేళ్ల జైలు
eenadu telugu news
Published : 19/10/2021 01:21 IST

బాలికతో అసభ్య ప్రవర్తన.. రెండేళ్ల జైలు

అమీన్‌పూర్‌, న్యూస్‌టుడే: బాలికతో అసభ్యంగా ప్రవర్తించిన వ్యక్తికి రెండేళ్ల జైలు శిక్ష పడింది. అమీన్‌పూర్‌ ఎస్‌ఐ ప్రసాద్‌ తెలిపిన ప్రకారం.. . అమీన్‌పూర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని ఓ గ్రామానికి చెందిన వడ్డె బాగయ్య(25) 5 నెలల క్రితం గ్రామంలోని ఓ బాలికను బయటికి తీసుకుని వెళ్లి అసభ్యంగా ప్రవర్తిస్తుండగా బాలిక అరుపులు విన్న తండ్రి అక్కడికి రావడంతో బాగయ్య పారిపోయాడు. తండ్రి ఫిర్యాదుతో అమీన్‌పూర్‌ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసుపై వాదోపవాదాలు విన్న తర్వాత ఫస్ట్‌క్లాస్‌ అదనపు సెషన్‌ కోర్టు జడ్జి సునితా సోమవారం తీర్పు చెప్పింది. నిందితుడికి రెండేళ్ల జైలు శిక్షతో పాటు రూ.వెయ్యి జరిమానా విధించారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని