ఎవరి చేతిలో ఉంది.. ఈ ఆసుపత్రికీ!
eenadu telugu news
Published : 19/10/2021 03:17 IST

ఎవరి చేతిలో ఉంది.. ఈ ఆసుపత్రికీ!

అమీర్‌పేట ప్రభుత్వాసుపత్రి గేటుకు తాళం

అమీర్‌పేట, న్యూస్‌టుడే: అమీర్‌పేటలో 50 పడకల ఆసుపత్రిని ప్రారంభించిన అధికారులు సిబ్బంది లేరనే కారణంతో మూత వేసిన వైనమిది. నూతనంగా నిర్మించిన 50 పడకల ఆసుపత్రిని ఈ నెల 14వ తేదీన కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ ప్రారంభించారు. ఆసుపత్రి ప్రారంభోత్సవంలో తెరాస, భాజపా కార్యకర్తలు..ఈ ఘనత మాదంటే మాదని.. ఘర్షణ పడ్డారు. ఆసుపత్రి తమ హయాంలోనే ప్రారంభమయ్యిందని కాంగ్రెస్‌ మాజీ ఎమ్మెల్మే మర్రి శశిధర్‌రెడ్డి విలేకరుల సమావేశం పెట్టి చెప్పారు. ఇదిలాఉంటే సిబ్బంది లేరనే కారణంతో మరుసటి రోజు నుంచే గేట్లు మూసి తాళం వేసి ఉంచడం గమనార్హం. ఈ విషయంపై ఆసుపత్రి సూపరింటెండెంట్‌ డా.దశరథను వివరణ కోరగా.. ఆసుపత్రికి కేటాయించిన వైద్యులు, సిబ్బంది డిప్యుటేషన్‌పై ఇతర విభాగాల్లో పనిచేస్తున్నారని, వారిని వెనక్కి రప్పించడానికి లేఖ రాశామని తెలిపారు. మంగళవారం నుంచి ఆసుపత్రిని కొనసాగిస్తామన్నారు. డిప్యూటేషన్‌పై వెళ్లిన వారు తిరిగొస్తే క్రమం తప్పకుండా నిర్వహిస్తామన్నారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని