విహారంలో విషాదం!
eenadu telugu news
Published : 19/10/2021 03:17 IST

విహారంలో విషాదం!

హంపీలో నీట మునిగి ఇద్దరు యువకుల మృతి  

నేరేడ్‌మెట్‌, కాప్రా, కుషాయిగూడ, గంగావతి, న్యూస్‌టుడే: విహారయాత్ర విషాదాన్ని నింపింది. చెరువులో మునిగి నగరానికి చెందిన ఇద్దరు యువకులు మృతిచెందిన ఘటన కర్ణాటకలో చోటుచేసుకుంది. నేరేడ్‌మెట్‌ పరిధి రామకృష్ణాపురానికి చెందిన నర్సింగ్‌రావు, జీకే కాలనీ వాసి అలోక్‌కుమార్‌, డిఫెన్స్‌ కాలనీలో ఉండే  మధుకిరణ్‌(25), కుషాయిగూడ, మారుతీనగర్‌కు చెందిన రాజేశ్‌కుమార్‌(26) ఆర్మీ స్కూల్లో కలిసి చదువుకున్నారు. తర్వాత డిగ్రీలు చదివి ఉద్యోగాలు చేస్తున్నారు. విహార యాత్రకని శనివారం ఉ.5 గంటలకు అలోక్‌కుమార్‌ కారులో బయలుదేరి సాయంత్రం హంపీ చేరుకున్నారు. మరుసటి రోజు సణాపుర చెరువు చూడటానికి వెళ్లారు. అలోక్‌కుమార్‌కు మినహా ఇతరులకు ఈత రాకపోయినా చెరువులోకి దిగి నర్సింగ్‌రావు నీట మునగగా, కాపాడేందుకు దిగి రాజేశ్‌, మధుకిరణ్‌ గల్లంతయ్యారు. అలోక్‌ నర్సింగరావును బయటకు తీశారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని