Fraud: అధిక వడ్డీ అంటూ రూ.10 కోట్లు స్వాహా
eenadu telugu news
Published : 19/10/2021 08:22 IST

Fraud: అధిక వడ్డీ అంటూ రూ.10 కోట్లు స్వాహా

ఈనాడు, హైదరాబాద్‌: అధిక వడ్డీ ఇస్తానంటూ వందలాది మంది నుంచి రూ.10 కోట్లకు పైగా వసూలు చేసిన వ్యక్తి చివరకు కనిపించకుండా పోయాడు. నెల్లూరు జిల్లాకు చెందిన ఓ వ్యక్తి ప్రస్తుతం బాచుపల్లిలో ఉంటున్నాడు. బాల్య మిత్రుడితో కలిసి గతేడాది ఆగస్టులో కూకట్‌పల్లిలో కార్యాలయం తెరిచి డిపాజిట్లు సేకరించారు. ఆ డబ్బులను ‘ట్రేడింగ్‌’లో పెట్టుబడులుగా పెట్టేవారు. లాభంతో సంబంధం లేకుండా డిపాజిటర్లకు ప్రతి నెలా రూ.లక్షకు రూ.6 వేల నుంచి రూ.10 వేల వరకు వడ్డీ చెల్లించేవారు. ఆ నోటా.. ఈ నోటా భారీగా ప్రచారం జరగడంతో, తక్కువ వ్యవధిలోనే రూ.10 కోట్లకు పైగా డిపాజిట్లు వచ్చినట్లుగా బాధితులు చెబుతున్నారు. విజయవాడలోనూ రూ.కోటి వరకు వసూలు చేసినట్లు తెలుస్తోంది. ఈ ఏడాది ప్రారంభం నుంచి మునుపటిలా వడ్డీ సమాయానికి ఖాతాల్లో జమ కావడం లేదు. కార్యాలయానికి వెళ్లి నిలదీస్తే జులై/ఆగస్టులో పూర్తి సెటిల్‌మెంట్‌ చేస్తానంటూ హామీ ఇచ్చాడు. ఆ సమయానికెళ్తే కార్యాలయం మూసేసి ఉంది. కూకట్‌పల్లి ఠాణాలో బాధితులు గత నెల 10న ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేశారు. స్టేషన్‌కు వెళ్తే, కేసు కమిషనరేట్‌కు బదిలీ అయ్యిందని.. అక్కడకు వెళ్తే స్పందించడం లేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని