సేవలను మరింత దగ్గర చేసేందుకే
eenadu telugu news
Updated : 19/10/2021 13:41 IST

సేవలను మరింత దగ్గర చేసేందుకే

ఈనాడు, హైదరాబాద్‌: సేవా కార్యక్రమాల్లో భాగం కావడం వ్యక్తిగతంగా ఎంతో సంతృప్తినిస్తుందని చెప్పారు కథానాయకుడు రామ్‌చరణ్‌.  ట్రస్ట్‌ సేవా కార్యక్రమాల్ని ప్రజలకి మరింత దగ్గర చేయడానికి ‌www.chiranjeevicharitabletrust.com వెబ్‌సైట్‌ని, చిరంజీవి సినీ విశేషాలతోపాటు, ఆయన చేసిన సేవా కార్యక్రమాలతో కూడిన  www.kchiranjeevi.com వెబ్‌సైట్‌ని రామ్‌చరణ్‌ సోమవారం హైదరాబాద్‌లోని చిరంజీవి ఛారిటబుల్‌ ట్రస్ట్‌ కార్యాలయంలో ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ‘‘సేవా కార్యక్రమాల్ని వివిధ ప్రాంతాల ప్రజలకు అందించేందుకు ఆన్‌లైన్‌ సేవల్ని ప్రారంభించాం. ఎవరికైనా రక్తం, ఆక్సిజన్‌ అత్యవసరమైతే ట్రస్ట్‌ వెబ్‌సైట్‌లో సాయం అడగొచ్చు. రక్తదానం చేయాలనుకున్నవాళ్లు ఇందులోనే స్లాట్‌ బుక్‌ చేసుకోవచ్చు. రక్తదానానికి వీలుగా ఉండేలా పలు ప్రాంతాల్లోనూ కార్యాలయాల్ని ప్రారంభిస్తాం. భవిష్యత్తులో యాప్‌ని తీసుకొచ్చే ఆలోచన కూడా ఉంది’’ అన్నారు.Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని