కుమార్తె సంబంధానికి వచ్చి..తల్లి అనంతలోకాలకు
eenadu telugu news
Published : 19/10/2021 03:17 IST

కుమార్తె సంబంధానికి వచ్చి..తల్లి అనంతలోకాలకు

నాచారం, న్యూస్‌టుడే: కుమార్తెకు పెళ్లి సంబంధం చూసేందుకు నగరానికి వచ్చిన మహిళ రోడ్డు ప్రమాదంలో మృతిచెందారు. ఈ ఘటన సోమవారం ఉప్పల్‌ పోలీసుస్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం....జనగాం పట్టణం గీతానగర్‌కు చెందిన వసంత(40) కుమార్తెకు మల్లాపూర్‌ నుంచి పెళ్లి సంబంధం వచ్చింది. పెళ్లి కుమారుడు కుటుంబసభ్యులను కలుసుకునేందుకు కుమారుడు సందీప్‌తో కలిసి ఉదయం జనగాంలో బస్సు ఎక్కి మధ్నాహ్నం ఉప్పల్‌ రింగు రోడ్డులో దిగింది. రోడ్డు దాటుతుండగా లారీ మహిళను ఢీకొట్టింది. ఆసుపత్రికి తరలిస్తుండగా మృతిచెందింది. తన కళ్ల ముందే తల్లి చనిపోవడంతో కుమారుడి రోదన స్థానికులను కలచివేసింది. లారీ డ్రైవర్‌ను రిమాండుకు తరలించారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని