Revanth Reddy: రెండు వర్గాల మధ్య విభేదాలు సృష్టిస్తున్నారు: రేవంత్‌
eenadu telugu news
Updated : 19/10/2021 14:18 IST

Revanth Reddy: రెండు వర్గాల మధ్య విభేదాలు సృష్టిస్తున్నారు: రేవంత్‌

వీరప్ప మొయిలీకి రాజీవ్‌ సద్భావన అవార్డు ప్రదానం

హైదరాబాద్‌: పేదల కష్టసుఖాలు తెలుసుకునేందుకు దివంగత ప్రధాని రాజీవ్‌గాంధీ సద్భావన యాత్ర చేశారని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి అన్నారు. దేశానికి హిందూ, ముస్లింలు రెండు కళ్లు అని రాజీవ్‌ చెప్పేవారని గుర్తు చేశారు. హైదరాబాద్‌లోని చార్మినార్‌ వద్ద రాజీవ్‌ సద్భావన దినోత్సవం సందర్భంగా నిర్వహించిన సభలో రేవంత్‌ మాట్లాడారు. అధికారం కోసం నేడు కొందరు రెండు వర్గాల మధ్య విభేదాలు సృష్టిస్తున్నారని ఆరోపించారు. 

ఈ సందర్భంగా కేంద్ర మాజీ మంత్రి, కర్ణాటక మాజీ సీఎం వీరప్ప మొయిలీకి రాజీవ్‌ సద్భావన అవార్డు అందజేశారు. దేశంలోనే తొలిసారిగా మైనార్టీలకు రిజర్వేషన్లు కల్పించి వారి జీవితాల్లో వెలుగులు తీసుకొచ్చిన మొదటి సీఎం వీరప్ప మొయిలీ అని రేవంత్‌ కొనియాడారు. అంతకుముందు కాంగ్రెస్‌ నేతలు సర్వమత ప్రార్థనలున నిర్వహించారు. ఈ సభలో రాష్ట్ర కాంగ్రెస్‌ వ్యవహారాల ఇన్‌ఛార్జ్‌ మాణికం ఠాగూర్‌, ముఖ్య నేతలు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, షబ్బీర్‌ అలీ, మధు యాష్కీ, వీహెచ్‌, గీతారెడ్డి తదితరులు పాల్గొన్నారు.



Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని