TSRTC: టీఎస్‌ఆర్టీసీకి రికార్డు స్థాయిలో ఆదాయం: సజ్జనార్‌
eenadu telugu news
Published : 19/10/2021 15:30 IST

TSRTC: టీఎస్‌ఆర్టీసీకి రికార్డు స్థాయిలో ఆదాయం: సజ్జనార్‌

హైదరాబాద్‌: టీఎస్ఆర్టీసీకీ రికార్డు స్థాయిలో ఆదాయం సమకూరింది. ఈనెల 18వ తేదీన ఒక్కరోజే రూ.14.79 కోట్ల ఆదాయం వచ్చినట్లు ఆర్టీసీ ఎండీ సజ్జనార్ వెల్లడించారు. ఈ ఒక్కరోజులో 36.30 లక్షల కిలోమీటర్ల దూరం ఆర్టీసీ బస్సులు ప్రయాణించాయన్నారు. బతుకమ్మ, దసరా సందర్భంగా టీఎస్ఆర్టీసీ నడిపించిన ప్రత్యేక బస్సులను తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రజలతో పాటు పొరుగున ఉన్న కర్ణాటక, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్‌, తమిళనాడు రాష్ట్రాలకు చెందిన ప్రజలు కూడా వినియోగించుకున్నందుకు సజ్జనార్ ధన్యవాదాలు తెలిపారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని