గంజాయి తరలింపు.. నిందితుడి రిమాండ్‌
eenadu telugu news
Published : 20/10/2021 00:58 IST

గంజాయి తరలింపు.. నిందితుడి రిమాండ్‌

వివరాలు వెల్లడిస్తున్న సంగారెడ్డి డీఎస్పీ బాలాజీ

మునిపల్లి, న్యూస్‌టుడే: కంకోల్‌ శివారు టోల్‌ప్లాజా వద్ద తనిఖీలో సోమవారం అర్థరాత్రి 240 కిలోల గంజాయి తరలిస్తూ పట్టుబడిన నిందితుడిని మంగళవారం రిమాండ్‌కు తరలించారు. బుధేరా పోలీస్‌స్టేషన్‌లో డీఎస్పీ బాలాజీ వివరాలను వెల్లడించారు. తమిళనాడుకు చెందిన రాజస్టాలిన్‌ బొలేరోలో ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం, పెందూర్తి నుంచి ముంబయికి అక్రమంగా తరలిస్తున్నట్లు సమాచారంతో సంగారెడ్డి ఎస్పీ ఆదేశాల మేరకు తనిఖీలు చేపట్టినట్లు తెలిపారు. వాహన తనిఖీల్లో రూ. 7.20 లక్షల విలువైన 120 గంజాయి పొట్లాలు లభించాయని మునిపల్లి తహసీల్దార్‌ ప్రవీణ్‌కుమార్‌ సమక్షంలో పంచనామా నిర్వహించామని తెలిపారు. సదాశివపపేట రూరల్‌ సీఐ లక్ష్మారెడ్డి, ఎస్సై మహేశ్వర్‌రెడ్డి సిబ్బంది పాల్గొన్నారు.

మొక్కల ధ్వంసం

జహీరాబాద్‌ అర్బన్‌: చెరకు తోటలో అంతర పంటగా సాగు చేస్తున్న గంజాయి మొక్కలను గుర్తించి ధ్వంసం చేసినట్లు జహీరాబాద్‌ గ్రామీణ ఎస్‌ఐ రవిగౌడ్‌ తెలిపారు. హోతి(కె) శివారులోని రైతు బోడ జాన్‌ పొలంలో రూ.5.80 లక్షల విలువైన గంజాయి మొక్కలను మంగళవారం గుర్తించినట్లు చెప్పారు. తహసీల్దార్‌ నాగేశ్వర్‌రావు, సీఐ రాజశేఖర్‌ సమక్షంలో పంచనామా నిర్వహించి దహనం చేసినట్లు చెప్పారు. నిషేధిత పంట సాగు చేస్తున్న రైతుపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ పేర్కొన్నారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని