అది అక్రమ నిర్మాణమే.. పనులు ఆపేశాం
eenadu telugu news
Updated : 20/10/2021 03:41 IST

అది అక్రమ నిర్మాణమే.. పనులు ఆపేశాం

‘ఈనాడు’ కథనానికి జీహెచ్‌ఎంసీ స్పందన

ఈనాడు, హైదరాబాద్‌: ఉప్పల్‌ ప్రధాన కూడలిలో నిర్మాణమవుతున్న మల్టీప్లెక్స్‌ నిర్మాణానికి అనుమతి లేదని జీహెచ్‌ఎంసీ తేల్చి చెప్పింది. కూడలిలోని మెట్రో స్టేషన్‌ పక్కన అనుమతి లేకుండా, భారీ ఎత్తున సెల్లార్‌ తవ్వి పనులు కొనసాగిస్తున్న విషయమై మంగళవారం ‘ఈనాడు’ కథనం ప్రచురించింది. ఓ ప్రజాప్రతినిధి కనుసన్నల్లో జరుగుతున్న భారీ అక్రమ నిర్మాణానికి అధికారులు అండగా నిలిచారన్న విమర్శలను ఎత్తిచూపడంతో జోనల్‌ కమిషనర్‌ ఉపేందర్‌రెడ్డి స్పందించారు. ‘‘2021 ఆగస్టు 28న సదరు నిర్మాణ సంస్థ మల్టీప్లెక్స్‌ నిర్మాణానికి చేసుకున్న దరఖాస్తును బిల్డింగ్‌ కమిటీ పరిశీలించింది. వేర్వేరు శాఖల నుంచి నిరభ్యంతర పత్రాలు(ఎన్వోసీ) తెచ్చుకోవాలని సూచించింది. అవన్నీ పరిశీలనలో ఉన్నాయి. ఇదిలా ఉండగానే నిర్మాణ పనులు చేపట్టారు. విషయం మా దృష్టికి రాగానే పనులు ఆపేశాం’’అని జడ్సీ వివరణ ఇచ్చారు.


9వ అంతస్తు నుంచి దూకి ఇంటర్‌ విద్యార్థిని ఆత్మహత్య

మియాపూర్‌, న్యూస్‌టుడే: ‘మా తల్లిదండ్రులు నా చదువుపై ఎక్కువ ఖర్చు చేస్తున్నారు. నేను చాలా పిరికిదాన్ని ఐ లవ్‌యూ ఆల్‌ ’ అంటూ లేఖ రాసి ఓ ఇంటర్‌ విద్యార్థిని బలవన్మరణానికి పాల్పడింది. మియాపూర్‌ ఎస్సై రవికుమార్‌ తెలిపిన ప్రకారం.. మియాపూర్‌ మై హోం జువెల్‌ అపార్ట్‌మెంఫటులో నివాసం ఉండే వీరేంద్రసింగ్‌ నేగి కుమార్తె జహన్వి నేగి ఓ ప్రైవేటు కళాశాలలో 12వ తరగతి (సీీబీఎస్‌ఈ) చదువుతోంది. సోమవారం రాత్రి కుటుంబ సభ్యులు ఇంట్లో ఎవరూ లేని సమయంలో వారు నివాసం ఉండే 9వ అంతస్తు నుంచి దూకి బలవన్మరణానికి పాల్పడింది. కొంతకాలంగా చదువుకు సంబంధించి ఆమె మానసిక ఒత్తిడికి గురవుతున్నట్లు పోలీసుల విచారణలో వెల్లడయింది. తల్లిదండ్రులు ఆమె పరిస్థితిని గమనించి కొంత ఊరట కలిగించేలా వ్యవహరించినప్పటికీ ఒత్తిడితోనే ఆమె ఈ అఘాయిత్యానికి పాల్పడి ఉండవచ్చని ఎస్సై తెలిపారు.Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని