జలపాతంలో మునిగి యువకుడి మృతి
eenadu telugu news
Published : 20/10/2021 02:00 IST

జలపాతంలో మునిగి యువకుడి మృతి

ప్రణీత్‌

అబ్దుల్లాపూర్‌మెట్‌, న్యూస్‌టుడే: స్నేహితులతో కలిసి జలపాతం చూసేందుకు వెళ్లి.. ఈత కొట్టేందుకు కాలువలో దిగిన యువకుడు నీట మునిగి మృతిచెందిన ఘటన అబ్దుల్లాపూర్‌మెట్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. మన్నెగూడ ప్రాంతానికి చెందిన పోతనపల్లి ప్రణీత్‌(18) డిగ్రీ చదువుతున్నాడు. మంగళవారం మధ్యాహ్నం పెద్దఅంబర్‌పేట్‌ అవుటర్‌ రింగ్‌ రోడ్డు కూడలి సమీపంలోని కత్వా జలపాతాన్ని చూసేందుకు స్నేహితులతో కలిసి వచ్చాడు. మిత్రులతో పాటు కాలువలో దిగగా.. లోతు తెలియక పోవడంతో పాటు ఈత రాకపోవడంతో నీటిలో మునిగి మృతి చెందాడు. పోలీసులు దర్యాప్తు చేపట్టారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని