ప్లీనరీ సంబంధ ఏర్పాట్లన్నీ త్వరగా పూర్తిచేయాలి
eenadu telugu news
Published : 20/10/2021 02:00 IST

ప్లీనరీ సంబంధ ఏర్పాట్లన్నీ త్వరగా పూర్తిచేయాలి

పనుల్ని పరిశీలించిన మంత్రి సబితారెడ్డి

పార్కింగ్‌ ప్రదేశాలను పరిశీలిస్తున్న మంత్రి సబితా, ఎంపీ రంజిత్‌రెడ్డి, ఎమ్మెల్యే గాంధీ,
మాజీ మేయర్‌రామ్మోహన్‌

మాదాపూర్‌, న్యూస్‌టుడే: తెరాస పార్టీ ప్లీనరీ సమావేశాల నిర్వహణకు సంబంధించి మాదాపూర్‌లోని హైటెక్స్‌లో ఏర్పాట్లు శరవేగంగా సాగుతున్నాయి. మంగళవారం ప్లీనరీ ఆహ్వాన కమిటీ సభ్యులు మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఎంపీ రంజిత్‌రెడ్డి, ఎమ్మెల్యే గాంధీ ఏర్పాట్లను పరిశీలించారు. సభా ప్రాంగణంతోపాటు బయట సిద్ధం చేస్తున్న పార్కింగ్‌ ప్రదేశాలను మంత్రి పరిశీలించారు. సమావేశాలకు వచ్చే ప్రతినిధుల వాహనాల పార్కింగ్‌ విషయంలో ఎలాంటి సమస్యలు లేకుండా చూడాలని ఆమె సూచించారు. హైటెక్స్‌ వెళ్లే మార్గంలో సమావేశం రోజున ట్రాఫిక్‌ నియంత్రణకు సంబంధించి తీసుకుంటున్న చర్యలపై ట్రాఫిక్‌ డీసీపీ విజయ్‌కుమార్‌ను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ నవీన్‌కుమార్‌, మాజీ మేయర్‌ బొంతురామ్మోహన్‌, కార్పొరేటర్లు జగదీశ్వర్‌గౌడ్‌, రోజా తదితరులున్నారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని