ఐటీ.. వినియోగంలో నగర పోలీస్‌ మేటి
eenadu telugu news
Published : 20/10/2021 02:11 IST

ఐటీ.. వినియోగంలో నగర పోలీస్‌ మేటి

ఈనాడు, హైదరాబాద్‌: నేరనియంత్రణ, నేరపరిశోధనలతోపాటు ప్రజలకు సేవలందించేందుకు హైదరాబాద్‌ పోలీసులు అత్యాధునిక సమాచార సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తున్నారు. ఈ విషయంలో ఇతర మెట్రో నగరాలు దిల్లీ, ముంబయిలతో పోలిస్తే అగ్రస్థానంలో ఉన్నారు. నగర కమిషనరేట్‌ పరిధిలోని 4.06లక్షల సీసీ కెమెరాలు ఉన్నాయి. ఈ ఏడాదిలో జనవరి నుంచి అక్టోబరు 19 వరకు శాంతిభద్రతలు, నేరసంబంధింత అంశాలకు సంబంధించిన 54,797 సంఘటనల దృశ్యాలను వీటి ద్వారా పోలీసులు విశ్లేషించారు.

కొవిడ్‌ సమయంలో.. కొవిడ్‌ విస్తరణను అడ్డుకొనే పరిజ్ఞానం కోసం ఒక సాఫ్ట్‌వేర్‌ను పోలీసులు అందుబాటులోకి తీసుకొచ్చారు. దీని సాయంతో హైదరాబాద్‌కు వచ్చిన విదేశీయుల వివరాలను, వారి కదలికలను ఎప్పటికప్పుడు గుర్తించారు. ఈ సాఫ్ట్‌వేర్‌తోనే లాక్‌డౌన్‌ సమయంలో మూడు కిలోమీటర్ల కంటే ఎక్కువదూరం ప్రయాణించిన వాహనాలను, వ్యక్తులను గుర్తించి వారికి ఈ-చలాన్‌లు పంపించారు. రౌడీషీటర్లు.. అంతర్రాష్ట్ర ముఠాలపై పోలీసులు పకడ్బందీగా ఎలక్ట్రానిక్‌ ఫైల్స్‌(ఈ-రికార్డులను) నిర్వహిస్తున్నారు. తాజాగా గ్యాంగ్‌ ఫైల్స్‌ మానిటరింగ్‌ సెల్‌ పేరుతో ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేశారు. నగర ప్రజలు శాంతియుతంగా జీవించేందుకు ఇవన్నీ చేస్తున్నామని కొత్వాల్‌ అంజనీకుమార్‌ తెలిపారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని