వేలల్లోనే వాడుతున్నారు..!
eenadu telugu news
Published : 20/10/2021 02:58 IST

వేలల్లోనే వాడుతున్నారు..!

ఆలస్యమైతేనే సెల్ఫ్‌ మీటర్‌ రీడింగ్‌కు అవకాశం

ఈనాడు, హైదరాబాద్‌: నెల కాగానే ఎవరి కరెంట్‌ బిల్లును వారే తీసుకునే సెల్ఫ్‌ మీటర్‌ రీడింగ్‌ ప్రక్రియ బాలారిష్టాలను ఎదుర్కొంటోంది. ప్రతినెలా మొబైల్‌లో యాప్‌ సాయంతో సొంతంగా కరెంట్‌ బిల్లులు తీసుకుంటున్నవారి సంఖ్య వేలల్లోనే ఉంది. ఈ ప్రక్రియపై వినియోగదారులకు సమాచారం లేకపోవడం, సిబ్బంది వచ్చి మీటర్‌ రీడింగ్‌ తీయడం ఆలస్యమైతేనే సెల్ఫ్‌మీటర్‌ రీడింగ్‌ పనిచేసేలా మార్పులు చేయడంతో దీన్ని వినియోగిస్తున్నవారి సంఖ్య తక్కువే ఉంది.

దక్షిణ తెలంగాణ విద్యుత్తు పంపిణీ సంస్థ(టీఎస్‌ఎస్పీడీసీఎల్‌), అంకుర సంస్థతో కలిసి సొంతంగా కరెంట్‌ బిల్లు తీసుకునే సౌకర్యాన్ని మేలో అందుబాటులోకి తీసుకొచ్చింది. దీనిపై సరైన అవగాహన లేక ప్రతినెలా ఉపయోగిస్తున్న వినియోగదారులు వేలల్లోనే ఉంటున్నారు.

ఇలా పనిచేస్తుంది...  
* వినియోగదారులు మొబైల్‌లో టీఎస్‌ఎస్పీడీసీఎల్‌ ఐటీ యాప్, భారత్‌ సెల్ఫ్‌మీటర్‌ రీడింగ్‌ యాప్‌లను డౌన్‌లోడ్‌ చేసుకోవాలి. 

* యాప్‌ తెరవగానే ‘కన్జూమర్‌ సెల్ఫ్‌ బిల్లింగ్‌’ ఐచ్ఛికం కన్పిస్తుంది. యూనిక్‌ సర్వీస్‌ నంబరు, చరవాణి నంబరు వంటి వివరాలు నమోదు చేయాలి. ఏ మీటర్‌ బిల్లింగ్‌ తీసుకోవాలనుకుంటున్నారో ఎంచుకోగానే మీటర్‌ స్కానింగ్‌ అని చూపిస్తుంది. దానిపై క్లిక్‌ చేసి మీటర్‌లో కేడబ్ల్యూహెచ్‌ వివరాలు వచ్చినప్పుడు స్కాన్‌ చేయాలి. స్కాన్‌ చేసిన రీడింగ్, మీటర్‌లో ఉన్న రీడింగ్‌ ఒకటే వచ్చిందా సరిచూసుకోవాలి. వివరాలు సక్రమంగా ఉంటేనే నెక్ట్స్‌ అని వచ్చిన చోట టచ్‌ చేయగానే బిల్లు ఆన్‌లైన్‌లో కన్పిస్తుంది. వెంటనే చెల్లించేయొచ్చు. వినియోగదారులకు ఇవన్నీ అర్థమయ్యేలా యాప్‌లో డెమో వీడియోలను సైతం తెలుగులో అందుబాటులో ఉంచారు. 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని