తమిళనాడు తరహాలో బీసీలు రాజ్యాధికారం సాధించాలి
eenadu telugu news
Published : 20/10/2021 03:09 IST

తమిళనాడు తరహాలో బీసీలు రాజ్యాధికారం సాధించాలి

అటవీ సిబ్బందికి ఆయుధాలివ్వండి

మంత్రికి అధికారుల సంఘం విజ్ఞప్తి

ఈనాడు, హైదరాబాద్‌: స్మగ్లింగ్‌ను అరికట్టడానికి అటవీ సిబ్బందికి ఆయుధాలు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వానికి రాష్ట్ర అటవీ అధికారుల సంఘం విజ్ఞప్తిచేసింది. సమస్యాత్మక ప్రాంతాలతో పాటు అమ్రాబాద్, కవ్వాల్‌ టైగర్‌ రిజర్వుల్లో ‘ఫారెస్ట్‌ ప్రొటెక్షన్‌ ఫోర్స్‌’ ఏర్పాటు చేయాలని కోరింది. దశాబ్దాలుగా అటవీ ప్రాంతాల్లో పనిచేస్తున్నప్పటికీ పదోన్నతులు లభించకపోవడం, వివిధ విభాగాల్ని ఒకే గొడుగు కిందికి తీసుకురావడం, 25 శాతానికి పైగా ఖాళీలతో పనిభారం, ఒత్తిడి పెరగడంపై అధికారులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని ఆందోళన వ్యక్తంచేసింది. అటవీశాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డిని మంగళవారం అరణË్యభవన్‌లో అటవీ అధికారుల సంఘ ప్రధాన కార్యదర్శి ఎం.రాజారమణారెడ్డితో పాటు సంఘం నేతలు ఎం.జోజి, కె.సుధాకర్‌రావు కలిసి వినతిపత్రం అందజేశారు. ‘రాష్ట్రంలో కేరళ తరహాలో ఫారెస్ట్‌ స్టేషన్లు ఏర్పాటుచేయాలి. అస్సాం తరహాలో ఆయుధాలతో గస్తీ తిరిగే వ్యవస్థ ఏర్పాటుచేయాలి. అటవీ ఆక్రమణలు, కలప స్మగ్లింగ్‌కు పాల్పడినవారికి ఏడేళ్ల వరకు శిక్ష పడేలా, నాన్‌బెయిలబుల్‌ కేసులు పెట్టేలా 1967 తెలంగాణ అటవీ చట్టాన్ని సవరించాలి. సమస్యాత్మక అటవీ ప్రాంతాల్లో రెండేళ్లుగా పనిచేస్తున్నవారిని బదిలీ చేయాలి. సమయానుకూలంగా పదోన్నతులివ్వాలి. సేవా పతకాలను తిరిగి ప్రవేశపెట్టాలి. ఉద్యోగులకు ద్విచక్ర వాహనాలు, కార్లు ఇవ్వాలి. కవ్వాల్, అమ్రాబాద్‌ పెద్దపులుల అభయారణ్యాల్లో ప్రత్యేకంగా ఎకో టూరిజాన్ని అభివృద్ధి చేయాలి’ మంత్రికి విజ్ఞప్తి చేశారు.
మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డికి వినతిపత్రం అందజేస్తున్న రాజారమణారెడ్డి

మాట్లాడుతున్న కృష్ణయ్య. చిత్రంలో శ్రీనివాస్‌గౌడ్, చిరంజీవులు, గణేష్‌చారి

బాగ్‌లింగంపల్లి, న్యూస్‌టుడే: తమిళనాడు తరహాలో తెలంగాణలో బీసీలు సంఘటితమై హక్కులు, రాజకీయ రిజర్వేషన్లు సాధించుకున్నప్పుడే ముఖ్యమంత్రి పీఠం దక్కుతుందని విశ్రాంత ఐఏఎస్‌ అధికారి పి.కృష్ణయ్య అన్నారు. మంగళవారం నగరంలోని సుందరయ్య కళానిలయంలో జరిగిన బీసీ ఉద్యోగుల సంఘం రాష్ట్ర కమిటీ సమావేశం, సభ్యత్వ నమోదు కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. అగ్రవర్ణ పాలకులు వారికి నచ్చిన రాజకీయ ఎజెండాను అమలు చేస్తున్నారని ఆరోపించారు.  విశ్రాంత ఐఏఎస్‌ అధికారి టి.చిరంజీవులు మాట్లాడుతూ రాష్ట్రంలో బీసీల్లో ఉత్పత్తి, సేవా కులాలు మాత్రమే ఉన్నాయన్నారు. వారికి  ప్రభుత్వ పథకాలు అందడం లేదని వాపోయారు. తెలంగాణ రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్‌ మాట్లాడుతూ బీసీ ఉద్యోగులకు పదోన్నతుల్లో రిజర్వేషన్లు కల్పించాలన్నారు. సమావేశానికి బీసీ ఉద్యోగుల సంఘం రాష్ట్ర ప్రతినిధి చంద్రశేఖర్‌ అధ్యక్షత వహించగా బీసీ కులాల ఐకాస రాష్ట్ర ఛైర్మన్‌ కుందారం గణేష్‌చారి, బీసీ మహిళా ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు గంగాపురం పద్మ, బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కులకచర్ల శ్రీనివాస్‌ పాల్గొన్నారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని