అంగన్‌వాడీ కేంద్రంలో కుళ్లిన గుడ్లు
eenadu telugu news
Published : 21/10/2021 01:01 IST

అంగన్‌వాడీ కేంద్రంలో కుళ్లిన గుడ్లు

యాలాల, న్యూస్‌టుడే: మండల పరిధిలోని కమాల్‌పూర్‌ గ్రామంలో అంగన్‌వాడీ కేంద్రంలో కుళ్లిన గుడ్లను పంపిణీ చేసిన ఘటన చోటుచేసుకుంది. ఇటీవల ఐసీడీఎస్‌ ఆధ్వర్యంలో గుత్తేదారు ద్వారా అంగన్వాడీ కేంద్రాలకు గుడ్లను పంపిణీ చేశారు. బుధవారం వీటిని ఉడకబెట్టి చిన్నారులకు ఇస్తుండగా కొన్నింటి నుంచి దుర్వాసన వ్యాపించింది. ఈ విషయాన్ని గమనించిన స్థానికులు అంగన్‌వాడీ సిబ్బందికి ఫిర్యాదు చేశారు. ఈ విషయమై యాలాల సూపర్‌వైజర్‌ నర్సమ్మను వివరణ కోరగా కేంద్రానికి 342 గుడ్లు వచ్చాయని, ఎక్కువ రోజులు నిల్వ ఉండడంతో ట్రేకు దాదాపు 5, 6 గుడ్లు పాడయ్యాయని చెప్పారు. వెంటనే గుత్తేదారుకు విషయం తెలిపానని వాటి స్థానంలో కొత్త గుడ్లను తెప్పిస్తామని చెప్పారు. పిల్లల విషయంలో తల్లిదండ్రులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆమె అన్నారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని