ఇక సూపర్‌ ఓఆర్‌ఆర్‌
eenadu telugu news
Published : 21/10/2021 02:25 IST

ఇక సూపర్‌ ఓఆర్‌ఆర్‌

 వాహనాలను జెండా ఊపి ప్రారంభిస్తున్న అర్వింద్‌కుమార్‌, సంతోష్‌

ఈనాడు డిజిటల్‌, హైదరాబాద్‌: బాహ్యవలయ రహదారి(ఓఆర్‌ఆర్‌)ను ఎప్పటికప్పుడు శుభ్రం చేసేందుకు అధునాతన ఊడ్చు(స్వీపింగ్‌) యంత్రాలను అందుబాటులోకి తెచ్చారు. వాయు నాణ్యత నిర్వహణ కార్యక్రమంలో భాగంగా రోడ్లను శుభ్రం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం రూ.5 కోట్లను హెచ్‌జీసీఎల్‌(హైదరాబాద్‌ గ్రోత్‌ కారిడార్‌ లిమిటెడ్‌)కు కేటాయించింది. ఆ నిధులతో 4 యంత్రాలు కొన్న హెచ్‌జీసీఎల్‌ నిర్వహణకు టెండర్లను పిలిచింది. ఈ వాహనాలను నానక్‌రామ్‌గూడ టోల్‌ప్లాజా వద్ద రాష్ట్ర పురపాలకశాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి అర్వింద్‌కుమార్‌, హెచ్‌జీసీఎల్‌ ఎండీ సంతోష్‌తో కలిసి బుధవారం జెండా ఊపి ప్రారంభించారు. ఓఆర్‌ఆర్‌ సర్వీసు రోడ్లనూ ఇవి శుభ్రం చేయనున్నాయి. 

 


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని