ఒక్క బండి.. చలాన్లు దండి
eenadu telugu news
Published : 21/10/2021 02:25 IST

ఒక్క బండి.. చలాన్లు దండి

రెజిమెంటల్‌బజార్‌, న్యూస్‌టుడే: నిబంధనలను ఉల్లంఘించినందుకు ఒక్క ద్విచక్ర వాహనంపై పడిన 90 చలాన్లు చూసి పోలీసులే ఆశ్చర్యపోయారు. బుధవారం శిరస్త్రాణం లేకుండా బైకుపై వెళుతున్న వ్యక్తిని సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌ వద్ద మహంకాళి ట్రాఫిక్‌ పోలీసులు ఆపారు. తనిఖీల్లో ఆ బండిపై 90 పెండింగ్‌ చలాన్లు ఉన్నట్లుగా గుర్తించారు. ఇందులో 78 శిరస్త్రానం లేకుండా నడిపినందుకు విధించిన ఇ-చలాన్లు ఉండటం గమన్హారం. మొత్తం రూ.32,960 చెల్లించాల్సి ఉందని, బైకును సీజ్‌ చేశామని ఎస్సై శంకర్‌నాయక్‌ తెలిపారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని