సెల్ఫీ వీడియో తీసుకుంటూ యువకుడి ఆత్మహత్య
eenadu telugu news
Published : 21/10/2021 08:42 IST

సెల్ఫీ వీడియో తీసుకుంటూ యువకుడి ఆత్మహత్య

వీడియోలో అశోక్‌

జవహర్‌నగర్‌, న్యూస్‌టుడే: సెల్ఫీ వీడియో తీసుకుంటూ యువకుడు ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన జవహర్‌నగర్‌ ఠాణా పరిధిలో బుధవారం చోటుచేసుకుంది. సీఐ భిక్షపతిరావు వివరాల ప్రకారం... బాలాజీనగర్‌ మోహన్‌రావు నగర్‌కాలనీలో దండెం మల్లేష్‌ కుటుంబంతో కలిసి ఉంటున్నారు. ఆయన కుమారుడు అశోక్‌(27)కు మూడేళ్ల కిందట వివాహమైంది. సంతానం లేదు. ఆన్‌లైన్‌ కొరియర్‌ సంస్థలో పనిచేస్తున్నాడు. బుధవారం ఉదయం 9.30కు విధులకు వెళ్లగా.. తల్లిదండ్రులు, అతడి భార్య నగరంలోని ఆసిఫ్‌నగర్‌లో బంధువుల వివాహానికి వెళ్లారు. మధ్యాహ్నం అశోక్‌ ఇంటికి తిరిగొచ్చి సెల్ఫీ వీడియో తీసుకొంటూ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. నేను నిజంగానే ఆత్మహత్య చేసుకుంటున్నట్లు నమ్మడం లేదు కదా.. ఇదిగో చూడు.. కింద స్టూల్‌ను తన్నేస్తున్నా.. అంటూ పేర్కొన్నాడు. ఇదీ బ్లాక్‌ చేసుకో... ఇదే చివరిది నానమ్మ వద్దకు వెళ్లిపోతున్నా.. అంటూ ముగించాడు. సాయంత్రం 4.30 గం.లకు కుటుంబ సభ్యులు తిరిగొచ్చి అశోక్‌ ఆత్మహత్య చేసుకున్నట్లు గుర్తించారు. పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ వీడియోలను స్నేహితుడికి పంపించినట్లు పోలీసులు గుర్తించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.


 


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని