గంజాయి రహిత జిల్లాగా మారుద్దాం: ఎస్పీ
eenadu telugu news
Published : 24/10/2021 00:49 IST

గంజాయి రహిత జిల్లాగా మారుద్దాం: ఎస్పీ

ఏఆర్‌ పోలీసులతో మాట్లాడుతున్న ఎస్పీ నారాయణ

వికారాబాద్‌, న్యూస్‌టుడే: జిల్లాలో గంజాయి సాగు నిర్మూలనకు సాయుధ బలగాల (ఏఆర్‌) పోలీసులు సహకరించి గంజాయి రహిత జిల్లాగా మార్చాలని పోలీసు అధికారి ఎం.నారాయణ తెలిపారు. శనివారం పోలీసు కార్యాలయంలో సాయుధ బలగాల పోలీసులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. ఏఆర్‌ పోలీసులు జిల్లాలోని ఏదో ఒక గ్రామానికి చెందినవారై ఉన్నారన్నారు. గ్రామంపై పూర్తి అవగాహన పెంచుకొని ఎవరి పొలంలోనైనా రహస్యంగా గంజాయి మొక్కలు సాగు చేస్తే వెంటనే సమాచారాన్ని అందించాలని కోరారు. మీరు దృష్టి పెడితే గంజాయిని నిర్మూలించడం పెద్ద కష్టమైన పనేం కాదన్నారు.ఏఎస్పీ రషీద్‌, ఆర్‌ఐలు రత్నం, అచ్యుతరావు, భరత్‌భూషణ్‌ పాల్గొన్నారు.

కొడంగల్‌, న్యూస్‌టుడే: గంజాయిని తుదముట్టించే వరకు పోలీసులు నిద్ర పోవద్దని డీఎస్పీ శ్రీనివాస్‌ అన్నారు. శనివారం స్థానిక ఫంక్షన్‌ హాల్లో ఏర్పాటు చేసిన ‘గంజాయి అంతంపై శంఖారావం’ కార్యక్రమంలో ఆయన పాల్గొని పోలీసులకు పలు సూచనలు సలహాలను అందించారు. అనంతరం బస్టాండ్‌ సమీపంలోని పలు దుకాణాలలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీీఐ అప్పయ్యతో పాటు ఎస్సైలు సామ్యానాయక్‌, వెంకటనారాయణ, రమేష్‌, మైపాల్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని