యాదాద్రి అద్భుత ఆలయం
eenadu telugu news
Published : 24/10/2021 02:01 IST

యాదాద్రి అద్భుత ఆలయం

స్వరూపానందేంద్ర సరస్వతి
స్వరూపానందేంద్ర ఆశీస్సులు అందుకుంటున్న సుబ్బారెడ్డి

చందానగర్‌, న్యూస్‌టుడే: రాజుల కాలం తర్వాత దేశంలోనే నిర్మించిన ఏకైక అద్భుత దేవాలయం యాదాద్రి అని విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి పేర్కొన్నారు. తెలంగాణలో కేసీఆర్‌ పాలన మతసామరస్యంతో సాగుతోందని, సనాతన ధర్మాన్ని గుర్తించి యాదాద్రిని మహాక్షేత్రంగా తీర్చిదిద్దారన్నారు. కేసీఆర్‌ మైలు రాళ్లలో తెలంగాణతోపాటు యాదాద్రి చిరస్థాయిగా నిలుస్తుందని, అక్కడ వేదిక్‌ యూనివర్సిటీ ఏర్పాటు చేసి వేదపారాయణ ఉద్యోగాలను తెలంగాణ బ్రాహ్మణులకు కల్పించాలని కోరారు. హిందువుల మనోభావాలను రాజకీయ పార్టీలు ఓటు బ్యాంకు కోసం వాడుకుంటున్నాయని స్వరూపానందేంద్ర ప్రకటనలో వెల్లడించారు.

కలిసిన తితిదే ఛైర్మన్‌

చందానగర్‌ వెంకన్న ఆలయ రజతోత్సవాల్లో పాల్గొనేందుకు వచ్చిన తితిదే ఛైర్మన్‌ సుబ్బారెడ్డికి ఆలయ ప్రధాన అర్చకులు సుదర్శనం సత్యసాయి, కమిటీ సభ్యులు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన విశాఖ శారద పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతిని కలిసి ఆశీస్సులు తీసుకున్నారు. ఆలయ కమిటీ సభ్యులు రఘుపతిరెడ్డి, సుభాష్‌, అశోక్‌కుమార్‌, సుబ్బారాయుడు, అశోక్‌గౌడ్‌, దేవేందర్‌రెడ్డి, వెంకట శేషయ్య, నాగేశ్వరరావు, బ్రహ్మయ్య గుప్త, రాంగోపాల్‌, శ్రీకాంత్‌ పాల్గొన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని