2027-28 నాటికి ట్రిలియన్‌ డాలర్ల ఎగుమతులకు ప్రణాళిక
eenadu telugu news
Published : 24/10/2021 02:01 IST

2027-28 నాటికి ట్రిలియన్‌ డాలర్ల ఎగుమతులకు ప్రణాళిక

రెడ్‌హిల్స్‌, న్యూస్‌టుడే: భారత ప్రభుత్వం 2021-22 ఆర్థిక సంవత్సరంలో రూ.400 బిలియన్‌ డాలర్ల ఎగుమతులు లక్ష్యంగా పెట్టుకుందని, సెప్టెంబరు చివరి నాటికే 49.5 శాతం లక్ష్యాన్ని సాధించిందని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ సంయుక్త కార్యదర్శి డా.శ్రీకర్‌ కె.రెడ్డి తెలిపారు. 2027-28 నాటికీ ఎగుమతులను ట్రిలియన్‌ డాలర్లకు పెంచుకోవాలని ప్రభుత్వం ప్రణాళిక రూపొందించుకుందని పేర్కొన్నారు. నగరంలో ఫెడరేషన్‌ ఆఫ్‌ తెలంగాణ ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ అండ్‌ ఇండస్ట్రీ (ఎఫ్‌టీసీసీఐ) ఆధ్వర్యంలో జర్నీ టువర్డ్స్‌ ఎక్స్‌పోర్ట్‌ ఎక్స్‌లెన్స్‌ సర్టిఫికెట్‌ ప్రదానోత్సవం జరిగింది. డా.శ్రీకర్‌ మాట్లాడుతూ.. ఫారెన్‌ ట్రేడ్‌ అగ్రిమెంట్‌(ఎఫ్‌టీఏ)లను సులభతరం చేసి, భారతీయ సంస్థలకు మార్కెటింగ్‌ అవకాశాలు పెంచేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందన్నారు. యుఏఈ, ఇజ్రాయెల్‌, యూరోపియన్‌ యూనియన్‌, యూకే, ఆస్ట్రేలియా, కెనడా వంటి దేశాలతో ఎఫ్‌టీఏ విషయంలో చర్చలు జరుగుతున్నాయన్నారు. ప్రతి జిల్లాను ఓ ఎగుమతి హబ్‌గా తీర్చిదిద్దాలనే ఆలోచనలో కేంద్రం ఉన్నట్లు చెప్పారు. మినిస్ట్రీ ఆఫ్‌ కామర్స్‌, ఫారెన్‌ ట్రేడ్‌ డైరెక్టర్‌ జనరల్‌ జి.సీతారామరెడ్డి మాట్లాడుతూ.. అంతర్జాతీయ వాణిజ్యంలో జిల్లాలను ఎగుమతి హబ్‌లుగా తీర్చేదిద్దే విషయంలో రాష్ట్ర ప్రభుత్వాల చొరవను ప్రస్తావించారు. సమావేశంలో ఎఫ్‌టీసీసీఐ అధ్యక్షుడు కె.భాస్కరరెడ్డి, పొకర్నా ఛైర్మన్‌ గౌతమ్‌చంద్‌ జైన్‌, సువెన్‌ ఫార్మా ఛైర్మన్‌ వెంకట్‌ జాస్తి, రవి ఫుడ్‌(డుకీ బ్రాండ్‌) డైరెక్టర్‌ రాజేంద్ర అగర్వాల్‌ మాట్లాడారు. ఎఫ్‌టీసీసీఐ సీనియర్‌ ఉపాధ్యక్షుడు అనీల్‌ అగర్వాల్‌, సీఈఓ ఖ్యాతి నారావణే ఉన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని