ట్యాంక్‌బండ్‌పై అతిపెద్ద క్రికెట్‌ బ్యాట్‌
eenadu telugu news
Published : 24/10/2021 02:08 IST

ట్యాంక్‌బండ్‌పై అతిపెద్ద క్రికెట్‌ బ్యాట్‌

బ్యాట్‌ ముందు అర్వింద్‌కుమార్‌, అజారుద్దీన్‌, జయేష్‌రంజన్‌ తదితరులు

కవాడిగూడ, న్యూస్‌టుడే : ప్రపంచంలో అతిపెద్ద క్రికెట్‌ బ్యాట్‌ను నగరంలోని ట్యాంక్‌బండ్‌పై ఏర్పాటు చేశారు. పెర్నోడ్‌ రికార్డ్‌ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌ కంపెనీ పోప్లర్‌ ఉడ్‌తో తొమ్మిది టన్నుల బరువుతో 56.1 అడుగుల పొడవుతో బ్యాట్‌ను రూపొందించింది. ఐసీసీ టీ20 ప్రపంచకప్‌ ప్రారంభమైన నేపథ్యంలో గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డు పొందిన బ్యాట్‌ను కంపెనీ సౌత్‌ ఇండియా జోనల్‌ హెడ్‌ ఉదిత్‌ దుగర్‌, రీజినల్‌ హెడ్‌ గోపాల్‌ అకోట్కర్‌లు తెలంగాణ ప్రభుత్వానికి అందించారు. రాష్ట్ర మున్సిపల్‌ పరిపాలన శాఖ ముఖ్య కార్యదర్శి, ఐ అండ్‌ పీఆర్‌ కమిషనర్‌ అర్వింద్‌కుమార్‌ శనివారం లాంఛనంగా ప్రారంభించి మాట్లాడారు. నగర వాసుల్లో ఉత్సాహం నింపేందుకు క్రికెట్‌ దోహదపడుతుందన్నారు. ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్‌ రంజన్‌, హైదరాబాద్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు ఎండీ అజహరుద్దీన్‌ మాట్లాడారు. అనంతరం అతిథులు బ్యాట్‌పై సంతకాలు చేశారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని