రక్కసిపై ఆవిష్కరణం!
eenadu telugu news
Published : 24/10/2021 02:21 IST

రక్కసిపై ఆవిష్కరణం!

అంకురాలకు ఐఐఐటీ లివింగ్‌ ల్యాబ్‌ ‘బ్యాక్‌ టు క్యాంపస్‌ టెక్‌ ఛాలెంజ్‌’

ఈనాడు డిజిటల్‌, హైదరాబాద్‌: బడులు, కార్యాలయాలు ఇప్పుడిప్పుడే తెరచుకుంటున్నాయి. కొవిడ్‌ మహమ్మారి మిగిల్చిన నష్టాల నుంచి తేరుకుంటున్నాయి. వైరస్‌ మళ్లీ వ్యాపిస్తోందన్న అధ్యయనాలు, వెంటాడే భయాల నడుమ వంద కోట్ల డోసుల వార్త భారత్‌కు ఓ ఉపశమనం. అయితే వైరస్‌ ఇక్కడితో ఆగుతుందనే నమ్మకం లేకపోగా.. విద్యార్థులు, ఉద్యోగులకు ఆ భయం లేని వాతావరణం సృష్టించేందుకు హైదరాబాద్‌ ఐఐఐటీ స్మార్ట్‌ సిటీ లివింగ్‌ ల్యాబ్‌ ఓ అడుగు ముందుకేసింది. ‘బ్యాక్‌ టు క్యాంపస్‌ టెక్‌ ఛాలెంజ్‌’ పేరిట వైరస్‌ కట్టడికి వినూత్న ఆవిష్కరణలు చేస్తున్న అంకురాలను ఆహ్వానించింది. ప్రధానంగా వ్యక్తుల స్క్రీనింగ్‌, టెస్టింగ్‌తో పాటు ప్రాంగణాల ఆటోమెటిక్‌ శానిటైజేషన్‌, గుంపులుగా చేరిన వారిపై నిఘా, వాహనాలు, వ్యక్తుల కదలికలు, ఆరోగ్య పరీక్షలు, గాల్లో వైరస్‌ను గుర్తించే సాంకేతికత, వాయు నాణ్యత ప్రమాదాల నిర్వహణ అంశాలపై పనిచేస్తున్న అంకుర సంస్థలు ఈ ఛాలెంజ్‌లో పాల్గొనే అవకాశముంది. https://smartcityresearch.iiit.ac.in/ challenge03.html లింకు ద్వారా నవంబరు 3వ తేదీలోపు ఔత్సాహిక అంకురాలు వివరాలు నమోదు చేసుకోవాలని స్మార్ట్‌ సిటీ లివింగ్‌ ల్యాబ్‌ లీడ్‌ ఆర్కిటెక్ట్‌ వట్టెం అనూరాధ కోరారు. తుది జాబితాలో నిలిచిన విజేతలను వివిధ ఐటీ సంస్థలు, విద్యాసంస్థలకు పరిచయం చేసే వేదిక తామిస్తామని.. వాటిని జనానికి అందుబాటులోకి తెచ్చేందుకూసహకరించనున్నట్లు తెలిపారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని