దాయాదుల పోరు.. వారాంతపు హుషారు
eenadu telugu news
Published : 24/10/2021 02:21 IST

దాయాదుల పోరు.. వారాంతపు హుషారు

ఈనాడు డిజిటల్‌, హైదరాబాద్‌: ఓ వైపు ఉత్కంఠ రేపే దాయాదుల పోరు.. మరోవైపు వినోదాన్ని పంచే ప్రదర్శనలు.. టేబుల్‌ ముందు నోరూరించే వంటకాలు.. పైగా వారాంతం.. ఇంకేముంది. ఆదివారం నగరవాసులు పండగ వాతావరణాన్ని ఆస్వాదించనున్నారు. వరల్డ్‌కప్‌లో భాగంగా దుబాయ్‌లో జరిగే భారత్‌, పాకిస్థాన్‌ టీ-20 క్రికెట్‌ పోటీ ఉండటంతో నగరంలోని క్లబ్‌లలో సందడి నెలకొంది. అసలే ఆదివారం, పైగా పెద్దపెద్ద తెరలు ఏర్పాటు చేసి ఉచిత ప్రవేశం కల్పిస్తుండటంతో స్నేహితులతో కలిసి క్లబ్‌లలో క్రికెట్‌ వాతావరణాన్ని ఆస్వాదించేందుకు సిద్ధమైపోయారు. ఒక్కో వేదిక వద్ద 200 నుంచి 600 మంది సామర్థ్యంతో ఏర్పాట్లు చేశారు.

సండే ఫండేలో..

సండే ఫండేలో క్రికెట్‌ అభిమానుల్లో మరింత జోష్‌ నింపేందుకు శనివారం ట్యాంక్‌బండ్‌పై అతిపెద్ద బ్యాట్‌ను ఏర్పాటు చేశారు. వేడుక అనంతరం ఈ బ్యాట్‌ను ఉప్పల్‌ స్టేడియానికి తరలించనున్నారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని