‘ఆకలి’ వద్దకు ‘ఆహారం’!
eenadu telugu news
Updated : 27/10/2021 12:59 IST

‘ఆకలి’ వద్దకు ‘ఆహారం’!

ఆకర్షణ, సౌకర్యం కలగలసిన నడిచొచ్చే ఫలహారశాల


గౌరారం వద్ద ట్రాక్టర్‌ ట్రాలీని హోటల్‌గా మార్చిన వైనం

న్యూస్‌టుడే, గజ్వేల్‌: అల్పాహారం ఎక్కడ దొరుకుతుందోనని వెతుక్కుంటూ పోనక్కర్లేదు. ఏరకమైన టిఫిన్‌ అయినా మీరున్న చోటికే వచ్చి తాజాగా అక్కడికక్కడే వండి, వడ్డించి తృప్తితీరా ఆకలి తీరుస్తున్నాయి గజ్వేల్‌లోని వాహనాలపై ఫలహారశాలలు. ఒకప్పుడు చౌరస్తాల్లో స్థిరంగా ఉండేవి ప్రస్తుతం ఆకర్షణ, సౌకర్యంతో ఆకలిగొన్నవారి వద్దకు వచ్చేస్తున్నాయి. వ్యాపారం పెంచుకోవడం.. ప్రజలకు సౌకర్యం కల్పించడం ఉద్దేశంగా గజ్వేల్‌కు చెందిన సతీశ్‌, వర్గల్‌ మండలం గౌరారానికి చెందిన ఓ హోటల్‌ యజమాని వాహనాలకు ఫలహారశాలగా మార్చేశారు. సతీశ్‌ రూ.పాతిక వేలు ఖర్చు చేశారు. గౌరారం వ్యక్తి ట్రాక్టర్‌ ట్రాలీని అందమైన నడిచొచ్చే హోటల్‌గా మార్చారు. మల్లన్నసాగర్‌ జలాశయం నిర్వాసితుల్లో ఎక్కువ మంది వాహనాలను ఫలహారశాలగా మార్చారు. జన సంచారం ఎక్కువగా ఉంటే అక్కడికి తీసుకెళ్లి ఉపాధి పొందుతున్నారు.


గజ్వేల్‌లో ఆటోపై..


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని