గుర్తు తెలియని దుండగుల దాడి.. నగదు చోరీ
eenadu telugu news
Published : 27/10/2021 01:45 IST

గుర్తు తెలియని దుండగుల దాడి.. నగదు చోరీ


గాయపడిన వ్యక్తి

మనోహరాబాద్‌, న్యూస్‌టుడే: వాహనం పక్కకు తీయడానికి సాయం కోరినందుకు వారిపైనే దాడి చేసి నగదు, చరవాణి ఎత్తుకెళ్లిన ఘటన మండల పరిధి కాళ్లకల్‌ పారిశ్రామికవాడ ప్రధాన చౌరస్తా వద్ద సోమవారం రాత్రి చోటుచేసుకుంది. బాధితులు తెలిపిన వివరాలు.. స్థానిక రిషబ్‌ పరిశ్రమ నుంచి సామగ్రిని జీడిమెట్లలోని పరిశ్రమకు ట్రాలీ వాహనంలో తీసుకెళ్తున్నారు. ఈ క్రమంలో పారిశ్రామికవాడ ప్రధాన చౌరస్తా వద్ద అదుపు తప్పి పడిపోయింది. చోదకుడికి గాయాలయ్యాయి. వెంటనే డ్రైవరు ఈ విషయాన్ని జీడిమెట్లలోని పరిశ్రమ యజమానికి సమాచారం ఇచ్చాడు. సదరు యజమాని మరో వాహనంలో ఘటనాస్థలికి చేరుకొని వాహనాన్ని లేపడానికి యత్నించాడు. అటుగా ద్విచక్ర వాహనంపై వెళ్తున్న ముగ్గురు యువకులను సాయం చేయాల్సిందిగా కోరారు. వారంతా కలిసి వాహనం లేపి పక్కకు జరిపారు. తాగునీటి సీసా తేవాలని కోరగా ఓ యువకుడు తెచ్చి ఇచ్చాడు. ఈ క్రమంలో యజమాని జేబులో నగదు ఉండటాన్ని గమనించి ఆ యువకులు వాహన చోదకుడు, యజమానిపై రాడ్‌తో దాడి చేసి వారి వద్ద ఉన్న రూ.35 వేలు, ఐఫోన్‌ను దుండగులు ఎత్తుకెళ్లారు. ఈ దాడిలో వారిద్దరికీ గాయాలయ్యాయి. అక్కడి నుంచి పారిపోయిన దుండగులు ముప్పిరెడ్డిపల్లి పారిశ్రామికవాడలోని ఓ పరిశ్రమ ముందు ఉన్న టీకొట్టు తలుపులు ధ్వంసం చేసి అందులో కొంత నగదు, సామగ్రి ఎత్తుకెళ్లారు. ఈ విషయమై ఎస్‌ఐ రాజుగౌడ్‌ను వివరణ కోరగా.. ఎలాంటి ఫిర్యాదు అందలేదని తెలిపారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని