క్రికెట్‌ బెట్టింగ్‌ ముఠా అరెస్టు
eenadu telugu news
Published : 27/10/2021 03:37 IST

క్రికెట్‌ బెట్టింగ్‌ ముఠా అరెస్టు

రూ.16లక్షల సొత్తు స్వాధీనం


నిందితులు

నేరేడ్‌మెట్‌, న్యూస్‌టుడే: అంతర్జాలంలో క్రికెట్‌ బెట్టింగ్‌ నిర్వహిస్తూ లక్షల్లో వ్యాపారం చేస్తున్న ముఠాలోని అయిదుగురిని రాచకొండ పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. రూ.16లక్షల నగదు, ల్యాప్‌టాప్‌, చరవాణులు స్వాధీనం చేసుకున్నారు. రాచకొండ కమిషనరేట్‌లో మంగళవారం సీపీ మహేష్‌ భగవత్‌ మీడియాకు వివరాలు వెల్లడించారు. చైతన్యపురి ఠాణా పరిధిలోని కొత్తపేట మోహన్‌నగర్‌కు చెందిన బైరామల్‌ శ్రీధర్‌(36) కోఠిలో ఓ బుక్‌ షాపు నిర్వహిస్తున్నాడు. ఏడాదిగా ఆన్‌లైన్‌ బెట్టింగ్‌ వ్యవహారాన్ని ఇంట్లో నుంచి సాగిస్తున్నాడు. దుకాణంలో పని చేసే సంబ్రం ఆంజనేయులు(26) సహకారం తీసుకునే వాడు. సరూర్‌నగర్‌కు చెందిన మద్యం వ్యాపారి జాజులరాముగౌడ్‌(43), రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు బోయిన్‌పల్లి ఛత్రపతి(51), గౌనిక్‌కల్యాణ్‌లు స్నేహితులు. వీరిని ఫంటర్లుగా ఉపయోగించుకునే వాడు. టీ-20 ప్రపంచకప్‌ మ్యాచ్‌లకు బెట్టింగ్‌పై మంగళవారం సమాచారంతో రాచకొండ ఎస్‌వోటీ, చైతన్యపురి పోలీసులు శ్రీధర్‌ ఇంటిపై దాడి చేసి అయిదుగుర్ని అరెస్టు చేశారు.

మరో ముగ్గురి అరెస్టు

ఆమనగలు: ఆమనగల్లు పురపాలికి విఠాయిపల్లిలో చంద్రాయన్‌పల్లితండా యువకులు జఠావత్‌ అశోక్‌, రాంచందర్‌, గోపాల్‌లు టీ-20 మ్యాచ్‌పై చరవాణుల్లో బెట్టింగ్‌ నిర్వహిస్తున్నారు. అందిన సమాచారంతో ఎస్సై ధర్మేశ్‌ వెళ్లి ముగ్గురిని అరెస్టుచేశారని సీఐ ఉపేందర్‌ తెలిపారు. రూ.20,100, చరవాణులు స్వాధీనం చేసుకున్నామన్నారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని