నర్సు మృతిపై అనుమానాలెన్నో?
eenadu telugu news
Published : 27/10/2021 03:37 IST

నర్సు మృతిపై అనుమానాలెన్నో?

ఈనాడు, హైదరాబాద్‌, న్యూస్‌టుడే, శేరిలింగంపల్లి: ఓయో రూంలో విగతజీవిగా కనిపించిన ‘నర్సు’ మృతి కేసులో పలు ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. పెళ్లి చేసుకోమని ఒత్తిడి తెచ్చినందుకే ప్రేమికుడు హత్య చేసి ఉంటాడని చందానగర్‌ పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు.

ఏం జరిగింది? : ప్రకాశం జిల్లా కరవాడి ప్రాంతానికి చెందిన నాగచైతన్య(24) నల్లగండ్లలోని సిటిజన్‌ఆసుపత్రిలో స్టాఫ్‌ నర్సు. గుంటూరు జిల్లా రెంటచింతలకు చెందిన గాదె కోటిరెడ్డి మెడికల్‌ రిప్రజంటేటివ్‌. ఇద్దరి మధ్య పరిచయం ప్రేమగా మారింది. ఈ క్రమంలో పెళ్లి చేసుకోవాలంటూ నాగచైతన్య.. కోటిరెడ్డిపై ఒత్తిడి తెస్తోంది. అతడి ఇంట్లో పెళ్లికి ఒప్పుకోలేదు. ఈ నెల 23న నల్లగండ్లలోని ఓయోలో గది అద్దెకు తీసుకున్నారు. మరుసటిరోజు రాత్రి వరకు తలుపులు తీయకపోవడంతో హోటల్‌ సిబ్బందికి అనుమానం వచ్చి తెరిచారు. నాగచైతన్య విగతజీవిగా కనిపించింది. చందానగర్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీఐ క్యాస్ట్రో రంగంలోకి దిగి.. ఒంగోలులోని ఓ ఆసుపత్రిలో కోటిరెడ్డి చికిత్స పొందుతున్నట్లు గుర్తించారు.

‘కత్తి’తోనే ఎందుకు?: ఇద్దరం ఆత్మహత్య చేసుకోవాలని అనుకున్నట్లుగా కోటిరెడ్డి పోలీసులకు వాంగ్మూలం ఇచ్చాడు. వేరే వ్యక్తి బలంగా కత్తితో పొడవటంతో నాగచైతన్య మరణించినట్లుగా పోస్ట్‌మార్టంలో వెల్లడైంది. కత్తితోనే ఎందుకు పొడుచుకోవాలనుకున్నారు? కోటిరెడ్డి ఒంటిపై గాయాలు.. అతడు ఒంగోలుకు ఎందుకు వెళ్లాల్సి వచ్చింది? అనే కోణాల్లో పోలీసులు ఆరా తీస్తున్నారు. మంగళవారం అతడిని అదుపులోకి తీసుకున్నారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని