ఘరానా చోరుడిపై మూడోసారి పీడీ యాక్టు
eenadu telugu news
Published : 27/10/2021 03:37 IST

ఘరానా చోరుడిపై మూడోసారి పీడీ యాక్టు


జంషీద్‌

మల్కాజిగిరి, న్యూస్‌టుడే: అతని పేరు షేక్‌ జంషీద్‌ అలియాస్‌ జమ్మి (39). వృత్తి హోటల్‌లో పని. ప్రవృత్తి దొంగతనాలు. పశ్చిమబెంగాల్‌లో నుంచి నిజామాబాద్‌ చేరుకుని అక్కడి రెస్టురూమ్‌ల్లో వంట పని చేసుకునేవాడు. నగరంలోని కింగ్‌కోఠిలో గది కిరాయికి తీసుకుని 19వ ఏట నుంచి చోరీలు చేయడం, జైలుకెళ్లటం పరిపాటిగా మారిది. మళ్లీ బయటకు వచ్చి నగరంలోనే 54 చోరీలు చేశాడు. ఇతని నేరచరిత్ర గమనించి పంజాగుట్ట ఠాణా నుంచి 2014లో, కుషాయిగూడ ఠాణా నుంచి 2018లో రెండుస్లార్లు పీడీ యాక్టు విధించారు. అతడు చోరీలు మానుకోలేదు. గత జులై 29న మల్కాజిగిరి ఠాణా పరిధిలో చోరీ చేసేందుకు రైలులో వచ్చాడు. అర్ధరాత్రి తిరుగుతున్న అతడ్ని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు. ఇక్కడి రెండు కాలనీల్లో చోరీ చేసినట్లు తేలడంతో అరెస్టు చేశారు. ఇతని నేరాల జాబితాను రాచకొండ సీపీ మహేష్‌ భగవత్‌ పరిశీలించి పీడీ యాక్టు విధించారని సీఐ జగదీశ్వరరావు, డీఐ వెంకటేశ్వర్లు తెలిపారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని