మొన్న ఎంజీబీఎస్‌.. నేడు జేబీఎస్‌
eenadu telugu news
Published : 27/10/2021 08:03 IST

మొన్న ఎంజీబీఎస్‌.. నేడు జేబీఎస్‌

ఈనాడు, హైదరాబాద్‌: టీఎస్‌ఆర్టీసీ ఆన్‌లైన్‌ చెల్లింపుల దిశగా వేగాన్ని పెంచింది. ఈనెల 19న మహాత్మాగాంధీ బస్సు స్టేషన్‌లో యూపీఐ, క్యూఆర్‌ కోడ్‌ ద్వారా ఆన్‌లైన్‌ చెల్లింపులు ప్రారంభించిన ఆర్టీసీ.. మంగళవారం నుంచి జేబీఎస్‌లోనూ ఆ సేవలను అందుబాటులోకి తెచ్చింది. టికెట్‌ బుకింగ్‌ కౌంటర్‌, రిజర్వేషన్‌ కేంద్రం, పార్సిళ్లు, కార్గో సేవలకు సంబంధించిన చెల్లింపులు యూపీఐ, క్యూఆర్‌ కోడ్‌ ద్వారా చేయవచ్చునని తెలిపింది. ఎంజీబీఎస్‌తోపాటు సీబీఎస్‌, రేతిఫైల్‌ బస్సు పాస్‌ కేంద్రాల దగ్గర ఆన్‌లైన్‌ చెల్లింపులకు ఆదరణ లభించడంతో రాష్ట్రంలోని అన్ని స్టేషన్లలో ఈ సేవలు అందుబాటులోకి తెస్తామని ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్‌ తెలిపారు. ఆర్టీసీలో అందుతున్న సేవలన్నింటిపైనా సలహాలు, సూచనలు టీఎస్‌ఆర్టీసీ ట్విటర్‌ ద్వారా అందజేయాలని కోరారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని