సింగారం బాట పట్టండి
eenadu telugu news
Published : 27/10/2021 03:37 IST

సింగారం బాట పట్టండి

చైతన్యపురి, న్యూస్‌టుడే: బాటసింగారం వెళ్లకుండా సర్వీస్‌రోడ్లపై తమ వ్యాపారం కొనసాగిస్తున్న వ్యాపారులపై గడ్డిఅన్నారం మార్కెట్‌ అధికారులు తమ ప్రతాపం చూపారు. మంగళవారం వ్యవసాయ మార్కెట్‌ ఉన్నతశ్రేణి కార్యదర్శి పద్మహర్షతో పాటు కార్యదర్శి నర్సింహారెడ్డి, సిబ్బంది మార్కెట్‌ వద్దకు చేరుకొని రోడ్డుపై వ్యాపారం చేయవద్దని, చేస్తే లైసెన్సులు ఉండవని హెచ్చరించారు. అయితే మార్కెట్‌ సిబ్బంది తమపై దౌర్జన్యం చేస్తున్నారని, పండ్లను రోడ్డుపై పారబోశారంటూ పలువురు వ్యాపారులు ఆందోళన వ్యక్తం చేశారు. ఇదిలా ఉండగా తమపై దౌర్జన్యం చేస్తున్నారని వ్యాపారులు చేస్తున్న ఆరోపణల్లో ఎంతమాత్రం నిజంలేదని నర్సింహారెడ్డి అన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని