రాష్ట్రంలో క్రీడాభివృద్ధికి పెద్దపీట
eenadu telugu news
Published : 27/10/2021 04:57 IST

రాష్ట్రంలో క్రీడాభివృద్ధికి పెద్దపీట


గోడపత్రికను ఆవిష్కరిస్తున్న మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌, ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి, చంద్రశేఖర్‌ తదితరులు

బంజారాహిల్స్‌, న్యూస్‌టుడే: రాష్ట్రంలో అంతర్జాతీయ స్థాయి క్రీడా మౌలిక సదుపాయాలు ఉన్నాయని, సీఎం కేసీఆర్‌ ఆదేశాల మేరకు క్రీడాభివృద్ధికి పెద్దపీట వేస్తున్నామని రాష్ట్ర క్రీడా, పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ పేర్కొన్నారు. మంగళవారం ఆయన క్యాంపు కార్యాలయంలో ఇండియన్‌ పవర్‌ లిఫ్టింగ్‌ ఫెడరేషన్‌ ఆధ్వర్యంలో లాల్‌ బహదూర్‌ స్టేడియంలో నవంబర్‌ 16 నుంచి 20 వరకు నిర్వహించనున్న ‘జాతీయ పవర్‌ లిఫ్టింగ్‌ ఛాంపియన్‌ షిప్‌- 2021’ గోడపత్రిక ఆవిష్కరించారు. కార్యక్రమంలో ఎల్‌బీనగర్‌ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి, రాష్ట్ర పవర్‌ లిఫ్టింగ్‌ ఫెడరేషన్‌ ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్‌ తదితరులు పాల్గొన్నారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని