న్యాక్‌ గ్రేడ్‌ సాధనకు హెచ్‌సీయూ యత్నం
eenadu telugu news
Published : 27/10/2021 04:57 IST

న్యాక్‌ గ్రేడ్‌ సాధనకు హెచ్‌సీయూ యత్నం

ఈనాడు, హైదరాబాద్‌: హైదరాబాద్‌ కేంద్రీయ విశ్వవిద్యాలయం న్యాక్‌ గ్రేడ్‌ తిరిగి సాధించేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది. ఇప్పటికే వర్సిటీ తరఫున స్వీయ అధ్యయన నివేదికను న్యాక్‌ కమిటీకి పంపించారు. హెచ్‌సీయూ 2014లో న్యాక్‌ ఫైవ్‌ స్టార్‌ హోదా దక్కించుకుంది. విశ్వవిద్యాలయ పనితీరు చూసి ఐదేళ్లకు బదులుగా ఏడేళ్ల కాలానికి గ్రేడ్‌ను న్యాక్‌ ఇచ్చింది. ఈ ఏడాది చివరికల్లా గ్రేడ్‌ గడువు ముగియనుంది. తిరిగి న్యాక్‌ గ్రేడ్‌ దక్కించుకునేందుకు గతేడాది సీనియర్‌ ఆచార్యుడు ప్రొ.వినోద్‌ పావరాల ఆధ్వర్యంలో ప్రత్యేక స్టీరింగ్‌ కమిటీని అప్పటి ఉపకులపతి ప్రొ.పొదిలె అప్పారావు నియమించారు. ఈ బృందం సమగ్రంగా అధ్యయనం చేసి ఇటీవల స్వీయ అధ్యయన నివేదికను న్యాక్‌కు పంపించింది. వచ్చే ఏడాది ఫిబ్రవరి లేదా మార్చి నాటికి ప్రక్రియ పూర్తయి గ్రేడ్‌ వస్తుందని హెచ్‌సీయూ అధికారులు భావిస్తున్నారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని