కేంద్రం, తెలంగాణలో అనైతిక పాలన
eenadu telugu news
Published : 27/10/2021 04:57 IST

కేంద్రం, తెలంగాణలో అనైతిక పాలన


మాట్లాడుతున్న ఏఐసీసీ ఎస్సీ విభాగం అధ్యక్షుడు నితిన్‌ రావత్‌, చిత్రంలో మహారాష్ట్ర రెవెన్యూ మంత్రి బాలసాహెబ్‌ తోరత్‌ తదితరులు

శంషాబాద్‌,న్యూస్‌టుడే: మాయ మాటలతో అధికారంలోకి వచ్చి అనైతిక పాలన సాగిస్తున్న కేంద్ర, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలకు రాబోవు ఎన్నికల్లో బుద్ధి చెప్పాలని ఏఐసీసీ ఎస్సీ విభాగం ఛైర్మన్‌, మహారాష్ట్ర విద్యుత్తు శాఖ మంత్రి నితిన్‌ రావత్‌ అన్నారు. మహారాష్ట్రలోని డెగ్లూర్‌ ఉప ఎన్నికల ప్రచారం కోసం వెళ్లేందుకు మంగళవారం ఆయన మహారాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి బాలసాహెబ్‌ తోరత్‌తో కలిసి శంషాబాద్‌ విమానాశ్రయానికి వచ్చారు. నొవాటెల్‌ హోటల్‌లో మీడియాతో మాట్లాడారు. టీపీసీసీ ఎస్సీ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు నాగరిగారి ప్రీతం, రాష్ట్ర ఉపాధ్యక్షుడు జల్లపల్లి నరేందర్‌ పాల్గొన్నారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని