ఆరుతడి విత్తనాలు విక్రయించండి: కలెక్టర్‌
eenadu telugu news
Published : 27/10/2021 04:57 IST

ఆరుతడి విత్తనాలు విక్రయించండి: కలెక్టర్‌


మాట్లాడుతున్న పాలనాధికారిణి నిఖిల

వికారాబాద్‌ కలెక్టరేట్‌, న్యూస్‌టుడే: యాసంగిలో వరి పంట విత్తనాలకు బదులుగా ప్రత్యామ్నాయ ఆరుతడి పంటల విత్తనాలు విక్రయించాలని జిల్లా పాలనాధికారిణి నిఖిల విత్తన విక్రయ వ్యాపారులకు సూచించారు. మంగళవారం జిల్లా పంచాయతీ వనరుల కేంద్రం మద్గుల్‌చిట్టెంపల్లిలో వ్యవసాయ విత్తనాలు డీలర్ల సమావేశంలో మాట్లాడారు. విత్తన డీలర్లు తమ దుకాణాలలో పొద్దు తిరుగుడు, వేరుశనగ, ఆవాలు, కంది, పెసర, మినుములు, అలసందలు, నువ్వులు, కూరగాయ విత్తనాలు వేసుకునే విధంగా విత్తనాలు అందుబాటులో ఉంచాలని తెలిపారు.ఈ సమావేశంలో జిల్లా అదనపు పాలానాధికారులు మోతీలాల్‌, చంద్రయ్య, జిల్లా వ్యవసాయాధికారి గోపాల్‌, డీలర్లు పాల్గొన్నారు.

కొవిడ్‌ టీకాలు.. 50 శాతం పూర్తి

వికారాబాద్‌ కలెక్టరేట్‌: జిల్లాలో కొవిడ్‌ టీకాలు 50 శాతం పూర్తి చేశామని జిల్లా పాలనాధికారిణి నిఖిల తెలిపారు. మంగళవారం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సోమేష్‌కుమార్‌ జిల్లా కలెక్టర్లతో దృశ్య మాధ్యమం ద్వారా మాట్లాడారు. ఈ సందర్భంగా జిల్లాలో కొవిడ్‌ టీకాల పంపిణీ వివరాలను వెల్లడించారు. ఇంటింటికి సర్వే చేసి మిగతా లక్ష్యాన్ని నిర్ణీత సమయంలో పూర్తి చేస్తామని తెలిపారు. ఈ సమావేశంలో జిల్లా అదనపు పాలానాధికారులు మోతీలాల్‌, చంద్రయ్య, జిల్లా వైద్యాధికారి తుకారాంభట్‌, జడ్పీ సీఈవో జానకిరెడ్డి, డీపీవో మల్లారెడ్డి పాల్గొన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని