close

బుధవారం, సెప్టెంబర్ 23, 2020

తాజా వార్తలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
విజయవంతమైన రక్తదాన శిబిరం

అమరచింత: అమరచింత తహశీల్దార్ కార్యాలయం, రెడ్‌క్రాస్ సొసైటీ సంయుక్త ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించిన రక్తదాన శిబిరం విజయవంతమైంది. తహశీల్దార్ సింధూజ,  పుర ఛైర్ పర్సన్ మంగమ్మ రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..  అన్ని దానాల కన్నా రక్తదానం గొప్పదన్నారు. ఒక్కసారి రక్తదానం చేస్తే ముగ్గురి ప్రాణాలు కాపాడవచ్చని తెలిపారు. రక్తం దానం చేయడం వల్ల ఎలాంటి సమస్యలు రావన్నారు. ఈ రక్తదాన శిబిరంలో మొత్తం 52 మంది రక్తం దానం చేసినట్లు రెడ్‌క్రాస్ సొసైటీ నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్సై ఆంజనేయులు, ఆర్‌ఐ వెంకటేశ్, వీఆర్వో శివ, నాయకులు నాగభూషణంగౌడ్, కలాంపాషా, సర్దార్, శ్యామ్‌, రెడ్‌ క్రాస్ సొసైటీ సభ్యులు శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.
 

మరిన్ని వార్తలు

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.