చనిపోతున్నానని భార్యకు చెప్ఫి.. అదృశ్యం!
eenadu telugu news
Published : 24/07/2021 02:03 IST

చనిపోతున్నానని భార్యకు చెప్ఫి.. అదృశ్యం!

సింగాటం చెరువులో గాలించినా దొరకని ఆచూకీ

 

గజ్వేల్‌ గ్రామీణ, న్యూస్‌టుడే: ‘నేను ఇంటికి రాను.. మనసు బాగాలేదు.. భూమి తనఖా పెట్టి తీసుకున్న అప్పు తీర్చ లేక పోతున్నా.. చనిపోతున్నా..’ అని భార్యకు ఫోన్‌ చేసి అదృశ్యమయ్యాడు భర్త. గజ్వేల్‌ మండలం సింగాటం చెరువు కట్టపై అతని ద్విచక్ర వాహనం, శిరస్త్రాణం, చెప్పులు కనిపించగా.. నీళ్లలో గాలించినా ఆచూకీ దొరకలేదు. గజ్వేల్‌ సీఐ ఆంజనేయులు తెలిపిన వివరాలు.. సింగాటం గ్రామానికి చెందిన చెప్యాల నరేశ్‌ (25) శుక్రవారం సోదరిని కొమురవెల్లి మండలం తాపస్‌పల్లిలో దింపి వస్తానని ఇంట్లో చెప్పి వెళ్లాడు. రాత్రి 7 గంటలైనా తిరిగి రాకపోయేసరికి భార్య పద్మ ఫోన్‌ చేయగా ఊరి చెరువు వద్ద ఉన్నానని.. ఆత్మహత్య చేసుకోబోతున్నా.. అంటూ ఫోన్‌ స్విచ్చాఫ్‌ చేశాడు. ఈతగాళ్లతో రాత్రి వరకు చెరువులో గాలించినా ఆచూకీ లేదు. భార్య ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని