అధికారులు అప్రమత్తంగా ఉండాలి
eenadu telugu news
Published : 28/09/2021 03:59 IST

అధికారులు అప్రమత్తంగా ఉండాలి

నల్గొండ కలెక్టరేట్‌, న్యూస్‌టుడే: భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున అధికారులు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్‌ ప్రశాంత్‌ జీవన్‌ పాటిల్‌ ఆదేశించారు. సోమవారం అధికారులతో టెలీ కాన్ఫరెన్స్‌ నిర్వహించి పరిస్థితి సమీక్షించారు. తమ కేంద్రాల్లో అధికారులు ప్రజలకు అందుబాటులో ఉండాలన్నారు. వర్షాల వల్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలను ప్రజలకు తెలియచేయాలన్నారు. పొంగి పొర్లే వాగులు దాటకుండా చర్యలు తీసుకోవాలన్నారు. చెరువుల సంరక్షణకు చర్యలు తీసుకోవాలని వివరించారు. జాలర్లు చేపల వేటకు వెళ్లకూడదన్నారు. పశువులను ఇంటి పట్టునే ఉంచుకోవాలని సూచించారు. ప్రజలు ప్రయాణాలు మానుకొని ఇంటిపట్టునే ఉండాలని వివరించారు. అదనపు కలెక్టర్‌ రాహుల్‌శర్మ, డీపీవో విష్ణువర్ధన్‌, అధికారులు వీరబ్రహ్మచారి, నారాయణ, జగదీశ్వర్‌రెడ్డి, రోహిత్‌, గోపిరాం తదితరులు పాల్గొన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని