గాయత్రిని ఆదుకునేందుకుకేటీఆర్‌ భరోసా
eenadu telugu news
Published : 28/09/2021 03:59 IST

గాయత్రిని ఆదుకునేందుకుకేటీఆర్‌ భరోసా

చండూరు, న్యూస్‌టుడే: చండూరుకు చెందిన దోనాల గాయత్రి అనే 21 ఏళ్ల యువతి మూత్రపిండాల వ్యాధితో బాధపడుతోంది. ‘ఈనాడు’లో ఈనెల 23న ‘మాత్రలు వేసుకుంటేనే మనుగడ’ శీర్షికన కథనం ప్రచురితమైంది. ఈ కథనాన్ని బండారు తేజ అనే వ్యక్తి మంత్రి కేటీఆర్‌కు ట్వీట్‌ చేశారు. విషయాన్ని పరిశీలించి ఆమెకు తగిన సాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. స్పందించిన కేటీఆర్‌ ‘మీము వీలైనంత త్వరగా సహకరిస్తాం బ్రదర్‌.... కేటీఆర్‌ ఆఫీస్‌ దయచేసి సమన్వయం చేయండి’ అని రీ ట్వీట్‌ చేశారు. బాధితురాలి తండ్రితో కేటీఆర్‌ కార్యాలయ సిబ్బంది ఆదివారం చరవాణిలో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. బాధితురాలికి ప్రభుత్వపరంగా సాయం అందితే ఆ కుటుంబానికి ఎంతో మేలు జరుగుతుంది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని