అణగారిన వర్గాల హక్కుల సాధనకు కృషి
eenadu telugu news
Published : 28/09/2021 03:59 IST

అణగారిన వర్గాల హక్కుల సాధనకు కృషి


కొండా లక్ష్మణ్‌ బాపూజీ చిత్రపటానికి నివాళి అర్పిస్తున్న కలెక్టర్‌ ప్రశాంత్‌ జీవన్‌ పాటిల్‌, అదనపు కలెక్టర్‌ చంద్రశేఖర్‌, తదితరులు

నల్గొండ కలెక్టరేట్‌, న్యూస్‌టుడే: అణగారిన వర్గాల హక్కుల సాధనకు కొండా లక్ష్మణ్‌ బాపూజీ ఎంతో కృషి చేశారని కలెక్టర్‌ ప్రశాంత్‌ జీవన్‌ పాటిల్‌ అన్నారు. కొండా లక్ష్మణ్‌ బాపూజీ జయంతి సందర్భంగా కలెక్టరేట్‌లో సోమవారం ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గాంధీజీ స్ఫూర్తితో దేశ స్వాతంత్య్ర ఉద్యమంలో పాల్గొన్నారని వివరించారు. ప్రజాస్వామ్య విలువలను జీవితాంతం పాటిస్తూ తెలంగాణ రాష్ట్ర సాధన పోరాటాల్లో పాల్గొని అన్ని దశల్లో లక్ష్మణ్‌ స్ఫూర్తిగా నిలిచారని పేర్కొన్నారు. సహకార రంగాల పటిష్ఠానికి జీవితమంతా కృషి చేశారని తెలిపారు లక్ష్మణ్‌ జయంతిని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తోందన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్‌ చంద్రశేఖర్‌, జిల్లా పౌరసంబంధాల అధికారి పి.శ్రీనివాస్‌, ఏవో మోతీలాల్‌, చంద్రవదన తదితరులు పాల్గొన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని