ముందస్తు జాగ్రత్తలతో రోగాలు దూరం
eenadu telugu news
Published : 28/09/2021 03:59 IST

ముందస్తు జాగ్రత్తలతో రోగాలు దూరం


సూర్యాపేట: ఔషధాలు పంపిణీ చేస్తున్న న్యాయమూర్తులు

సూర్యాపేట న్యాయవిభాగం, న్యూస్‌టుడే: ముందస్తు జాగ్రత్తలతో రోగాలు దరిచేరవని సూర్యాపేట రెండో అదనపు జిల్లా న్యాయమూర్తి పాటిల్‌ వసంత్‌ అన్నారు. సూర్యాపేటలోని న్యాయవాదుల సంఘం భవనంలో డెంగీ వ్యాధి నివారణకు హోమియో మందుల పంపిణీ కార్యక్రమాన్ని సోమవారం ప్రారంభించి మాట్లాడారు. కార్యక్రమంలో సూర్యాపేట సీనియర్‌, జూనియర్‌ సివిల్‌ జడ్జిలు జితేంద్ర, ఎన్‌.శ్రీకాంత్‌బాబు, బార్‌ అసోసియేషన్‌ అధ్యక్ష, కార్యదర్శులు గుడిపురి వెంకటేశ్వరరావు, బత్తిని వెంకటేశ్వర్లు, అదనపు పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ గ్రంధి వెంకటేశ్వర్లు, సహాయ ప్రభుత్వ న్యాయవాది డి.మల్లయ్య, సీనియర్‌ న్యాయవాదులు డి.ఉమాపతి, జె.శశిధర్‌, ఎ.శ్రవణ్‌కుమార్‌, జి.రమాదేవి, ఇతర న్యాయవాదులు పాల్గొన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని