యాసంగిలో ఆరుతడి పంటలే మేలు: డీఏవో
eenadu telugu news
Published : 28/09/2021 03:59 IST

యాసంగిలో ఆరుతడి పంటలే మేలు: డీఏవో

యాదగిరిగుట్ట: రైతులకు అవగాహన కల్పిస్తున్న డీఏవో కె.అనురాధ

భువనగిరి గ్రామీణం, యాదగిరిగుట్ట పట్టణం, న్యూస్‌టుడే: యాసంగిలో ఆరుతడి పంటలైన పెసర, మినుములు, శనగ, వేరుశనగ, కుసుమ, పొద్దుతిరుగుడుతో పాటు కూరగాయల పంటల సాగు చేసుకోవాలని డీఏవో కె.అనురాధ సూచించారు. మండలంలోని వంగపల్లి క్లస్టర్‌ రైతు వేదిక భవనంలో సోమవారం అవగాహన కల్పించారు. వరికి ప్రత్యామ్నాయ పంటలను వేసుకోవాలని చెప్పారు. ఏరువాక కేంద్ర పరిశోధకుడు నరేందర్‌ మాట్లాడారు. జిల్లా ఉద్యానవన అధికారిణి అన్నపూర్ణ, ఏడీఏ పద్మావతి, రైబస జిల్లా అధ్యక్షుడు కొల్పుల అమరేందర్‌, ఎంపీపీ చీర శ్రీశైలం, జడ్పీటీసీ సభ్యురాలు అనురాధ పాల్గొన్నారు. అనంతరం డీఏవో భువనగిరి పట్ణణంలోని పీస్‌ సంస్థ  కార్యాలయంలో జరిగిన జీవ వైవిధ్యం, సేంద్రీయ వ్యవసాయం సాగుపై జరిగిన సదస్సులో పాల్గొన్నారు. ఏరువాక శాస్త్రవేత్త నరేందర్‌ సూచనలు చేశారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని