దివ్యాంగులకు చేయూతనందించాలి
eenadu telugu news
Published : 28/09/2021 03:59 IST

దివ్యాంగులకు చేయూతనందించాలి

చౌటుప్పల్‌గ్రామీణం, న్యూస్‌టుడే: దివ్యాంగులకు చేయూత అందించడం అభినందనీయమని చౌటుప్పల్‌ ఏసీపీ ఉదయ్‌రెడ్డి పేర్కొన్నారు. జీఎమ్మార్‌ వరలక్ష్మి ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో నిల్డ్‌ సహకారంతో దివ్యాంగులకు 22 ట్రై సైకిళ్లు, 14 చక్రాల కుర్చీలు, 46 వినికిడి యంత్రాలను ఏసీపీ చేతుల మీదుగా పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఎంపీపీ తాడూరి వెంకట్‌రెడ్డి, ఎంపీడీవో రాకేశ్‌రావు, సర్పంచి బాతరాజు సత్యం, మాజీ జడ్పీటీసీ సభ్యుడు పెద్దిటి బుచ్చిరెడ్డి, జీఎమ్మార్‌ మేనేజర్‌లు శ్రీకాంత్‌, శ్రీధర్‌రెడ్డి, ఎన్‌హెచ్‌ఏఐ ప్రతినిధులు విజయ్‌ సొంగ, భానుప్రసాద్‌, జీఎమ్మార్‌ వరలక్ష్మీ ఫౌండేషన్‌ ప్రతినిధి శ్రీనివాస్‌రెడ్డి పాల్గొన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని