చారిత్రక కట్టడాల పరిరక్షణకు చర్య
eenadu telugu news
Published : 28/09/2021 03:59 IST

చారిత్రక కట్టడాల పరిరక్షణకు చర్య

నృత్య ప్రదర్శన చేస్తున్న యువకులు

భువనగిరి పట్టణం, న్యూస్‌టుడే: జిల్లాలోని చారిత్రక కట్టడాల పరిరక్షణకు చర్యలు చేపడతామని కలెక్టర్‌ పమేలా సత్పత్తి అన్నారు. ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా సోమవారం భువనగిరి కోట వద్ద పర్యాటకశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆమె పాల్గొని మాట్లాడారు. జిల్లా పరిధిలో ఎన్నో అద్భుత కట్టడాలు, పర్యాటక ప్రాంతాలు ఉన్నాయని తెలిపారు. ఫోటో జర్నలిస్టులు ఆయా ప్రాంతాల ఫోటోలను ప్రజలకు పరిచయం చేయాలని, తీసిన ఫోటోలను జిల్లా వెబ్‌సైట్‌లో పెట్టేందుకు మెయిల్‌ ద్వారా తమకు పంపించాలని కోరారు. భువనగిరి కోట అద్భుత కట్టడమని అభివృద్ధికి కృషి చేస్తామన్నారు. రోప్‌వే, ఇతర అభివృద్ధి నిర్మాణాలు చేపట్టే విధంగా చర్యలు తీసుకుంటామని ప్రకటించారు. పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాలను ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తుందన్నారు. అదనపు కలెక్టర్‌ దీపక్‌ తివారి మాట్లాడారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాల్లో యువకులు, విద్యార్థులు ఆటా, పాటతో సందడి చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా టూరిజం అధికారి ధనుంజయ, వారసత్వ కమిటీ అధ్యక్షుడు సద్ది వెంకట్‌రెడ్డి, కన్వీనర్‌ దిడ్డి బాలాజీ పాల్గొన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని