ప్రభుత్వ కళాశాలకు అతిధిలొస్తున్నారు..
eenadu telugu news
Updated : 16/10/2021 09:54 IST

ప్రభుత్వ కళాశాలకు అతిధిలొస్తున్నారు..

హుజూర్‌నగర్‌లో పాఠం బోధిస్తున్న అతిథి అధ్యాపకుడు నర్సింహారెడ్డి

నడిగూడెం, న్యూస్‌టుడే: ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో ఖాళీగా ఉన్న అధ్యాపకుల పోస్టులను అతిథి అధ్యాపకుల(గెస్ట్‌ ఫ్యాకల్టీ)తో భర్తీ చేసేందుకు ఇంటర్‌ బోర్డు గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా 404 ప్రభుత్వ కళాశాలల్లో అధ్యాపకుల కొరత తీరనుంది. కొవిడ్‌ అనంతరం సెప్టెంబర్‌ 1 నుంచి కళాశాలల్లో ప్రత్యక్ష బోధన ప్రారంభమైంది. అయినా చాలా కళాశాలల్లో పాఠాలు బోధించేందుకు అధ్యాపకులు అందుబాటులో లేరు. గత విద్యాసంవత్సరంలో ఫిబ్రవరి నుంచి ఏప్రిల్‌ వరకు అతిథి అధ్యాపకులను ఇంటర్‌ బోర్డు నియమించింది. రెండో విడతలో కరోనా మహమ్మారి ప్రబలడంతో కళాశాలలకు ప్రభుత్వం సెలవులు ప్రకటించింది. కళాశాలల్లో ప్రత్యక్ష తరగతులు పునఃప్రారంభమైనా అతిథి అధ్యాపకులను నియమించకపోవడంతో నెల రోజుల నుంచి బోధన కుంటుపడింది. ఎట్టకేలకు అతిథి అధ్యాపకుల నియామకానికి ఇంటర్‌ బోర్డు చర్యలు చేపట్టడంతో బోధన సిబ్బంది కొరతకు చెక్‌ పడనుంది. కళాశాలల్లో పోస్టులు మంజూరై ఖాళీగా ఉన్న స్థానాల్లో అతిథి అధ్యాపకులను నియమించనుంది. గతేడాది పనిచేసిన వారిని కొనసాగించేందుకు అవకాశం కల్పించింది. వాళ్లు అందుబాటులో లేకపోతే కొత్తముఖాలను నియమించాలని సూచించింది.

తీరనున్న బోధన సిబ్బంది కొరత...

నల్గొండ, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో 30 ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో 137 అధ్యాపక పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇంటర్‌ బోర్డు నిర్ణయంతో వీటిని అతిథి అధ్యాపకులతో భర్తీ చేయనున్నారు. ఈ విద్యాసంవత్సరంలో ప్రత్యక్ష తరగతుల పునఃప్రారంభం తరువాత సుమారు నెల రోజులుగా సరిపడా అధ్యాపకులు అందుబాటులో లేకపోవడంతో కొన్ని సబ్జెక్టులకు సంబంధించిన పాఠ్యాంశాలను విద్యార్థులు వినటం లేదు. తాజాగా ఇంటర్‌ బోర్డు నిర్ణయంతో ప్రభుత్వ కళాశాలల్లో బోధన సిబ్బంది కొరత తీరనుంది.


నిబంధనల ప్రకారం భర్తీ: జానపాటి కృష్ణయ్య, జిల్లా ఇంటర్మీడియట్‌ అధికారి, సూర్యాపేట

జిల్లాలో ఖాళీగా ఉన్న అధ్యాపకుల పోస్టుల్లో అతిథి ప్రాతిపదికన నియమించేందుకు ఇంటర్‌ బోర్డు ఉత్తర్వులు జారీ చేయడంతో కళాశాలల్లో బోధన సమస్య పరిష్కారమవుతుంది. నిబంధనల ప్రకారం అధ్యాపక పోస్టుల భర్తీకి చర్యలు చేపడతాం.


జిల్లా ఇంటర్‌ భర్తీకానున్న విద్యార్థులు

కళాశాలలు అధ్యాపకుల సంఖ్య

నల్గొండ 12 58 8,146

యాదాద్రి 1 1 36 4,214

సూర్యాపేట 07 43 3,504Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని